HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Is An Enemy Of Hinduism Says Janasena Mlc Nagababu In Sensational Remarks

వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

  • Author : Vamsi Chowdary Korata Date : 04-02-2026 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena Mlc Naga Babu
Janasena Mlc Naga Babu

Janasena Mlc Naga Babu  వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం కడితే జగన్ కనీసం ట్వీట్ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. హిందూ మతం గురించి మాట్లాడేవారికి.. అయోధ్యలో రామమందిరం గురించి తమ స్టాండ్ ఏమిటో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ జగన్‌పై నాగబాబు విమర్శలు గుప్పించారు. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్పోడా అంటూ వీడియో విడుదల చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు విమర్శలు గుప్పించారు. వివిధ అంశాల మీద స్పందిస్తూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేశారు. తాను సనాతన హిందువును అని చెప్పిన పవన్ కళ్యాణ్.. తన ధర్మాన్ని గౌరవిస్తూ, ఇతరులను గౌరవించకుండా బతుకుతున్నానని అన్నారు. తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. కల్తీ నెయ్యి విషయం గురించి మళ్లీ మాట్లాడతానని అన్నారు.

నేను సగటు భారతీయుణ్ని, హిందువును, నాస్తికుడిని కాదు. ఆదిశంకరుల అద్వైతం, రమణ మహర్షుల ఆత్మజ్ఞానం.. ఇద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైన పరమాత్మను నమ్ముతా. హిందూ అనేది నమ్మకమో, మతమో కాదు.. ఓ జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకూ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. నేను నిఖార్సైన హిందువును. నా ధర్మా్న్ని గౌరవిస్తూ , ఇతరులను కించపరచకగుండా బతుకుతున్న ప్రౌడ్ సనాతన హిందువును. ఎమ్మెల్సీగా మాట్లాడే అవకాశం రాగానే అర్చకుల చాలీచాలని జీతాల గురించి మాట్లాడా.

అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైతే.. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి అప్పటి వైసీపీ సర్కారు కేసును సీబీఐకు అప్పగిస్తామని చెప్పింది. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకుంటే అసలు ఈ కేసును టేకప్ చేయలేదని సీబీఐ చెప్పింది. వైసీపీ దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా.. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమైతే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కేసును నీరుగార్చారు. మీకూ, మీ నేతలకు రిలీజ్ సినిమాలకు రివ్యూలివ్వటం తప్పితే రాముడి గురించి ఎందుకు” అని నాగబాబు ప్రశ్నించారు.

అయోధ్యలోఎన్నో ఏళ్ల తర్వాత రామాలయం నిర్మాణం పూర్తి అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి దర్శించుకున్నారు. వైసీపీ నాయకుడు కనీసం ఒక ట్వీట్ అయినా, వీడియో బైట్ అయినా పెట్టారా. అసలు దీనిపై మీ స్టాండ్ ఏమిటో చెప్పారా. ఆ దమ్ముందా.. మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు..అభినందించే సంస్కారం లేదు. తిరుమల శ్రీవారిని ఏడాదికి ఒకసారైనా దర్శించుకోవాలనేది హిందువుల కల. నెల నెలా డబ్బులు కూడపెట్టుకుని తిరుమలకు వెళ్తుంటారు. అలాంటిది వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండ మీద వసతి ఛార్జీలు భారీగా పెంచారు. ఐదు వందలకు దొరికే రూములను వేయి, 1500లకు పెంచారు. దర్శనాలు, సేవలు ఇంకా దారుణం.

మరోవైపు తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ ఎమ్మెల్సీ నాగబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు.. తన కూతురుకు డిక్లరేషన్ ఇప్పించారని నాగబాబు గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లారన్న పవన్ కళ్యాణ్.. వైఎస్ జగన్ కలాం కంటే గొప్ప వ్యక్తా అని ప్రశ్నించారు. డిక్లరేషన్ అడిగారనే కారణంతో తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న చరిత్ర వైఎస్ జగన్‌ది అంటూ నాగబాబు మండిపడ్డారు. కల్తీ నెయ్యి గురించి తర్వాత మాట్లాడతానంటూ వీడియో విడుదల చేశారు.

హిందూ ద్రోహి వైసీపీ #NoGheeInTTDLaddu@JanaSenaParty pic.twitter.com/m6qMO3q60v

— Naga Babu Konidela (@NagaBabuOffl) February 4, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Former CM YS Jaganmohan Reddy
  • Janasena
  • Janasena Mlc Naga Babu
  • Laddu Issue
  • naga babu
  • Tirumala Issues
  • Tirumala Laddu Issue
  • tirupati laddu issue
  • TTD Laddu issue
  • YSR Congress Party

Related News

Amaravati Inner Ring Road Case

Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Chandrababu  ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐకి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు దర్యాప్తును అప్పగించాలని, ఈ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని, ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Araku MP Allocates Funds for Kovur's Development

    Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు

Latest News

  • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

  • కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

  • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

  • TVK Candidate List 2026 : త్రిష చెప్పిన వారికే విజయ్ టికెట్స్ ఇచ్చాడా ?

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd