HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Hot Comments On Ttd Laddu Issue And Kutami Govt

YS Jagan: ల‌డ్డూ వివాదం అందుకే తెచ్చారు.. వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశారు.

  • Author : Gopichand Date : 04-10-2024 - 4:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Social Media
Jagan Social Media

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని మాజీ సీఎం జగన్ (YS Jagan) తెలిపారు. సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని, ఆయన మోసాన్ని గుర్తించిందన్నారు. అందుకే తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ చంద్రబాబుకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. కోట్ల మంది హిందువుల మనోభావాల విషయంలో చంద్రబాబు అబద్ధాలు ఆడారాని పేర్కొన్నారు. పాల‌న ఫెయిల్ కావ‌డంతోనే ల‌డ్డూ వివాదం తెర‌పైకి తెచ్చార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు భయం, భక్తి కలిగిన వ్యక్తి ఎవరైనా సరే దేవుడికి క్షమాపణ చెబుతాడని, కానీ చంద్రబాబుకు పశ్చాత్తాపంలేదని విమర్శించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబు అబద్ధాలు మానలేదన్నారు. పరిపాలనలో సీఎం చంద్రబాబు ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా తిరుమల లడ్డూపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారని తెలిపారు. కల్తీ నెయ్యి ఉన్న ట్యాంకర్‌లను వెనక్కి పంపామని టీటీడీ ఈవో చెబితే.. హామీల అమలు విషయంలో సమాధానం లేక.. కల్తీనెయ్యి వాడామని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు.

Also Read: Khamenei: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏకం కావాలి: సుప్రీం లీడ‌ర్ అలీ ఖ‌మేనీ

సనాతన ధర్మం అంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలుసా అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ‘‘సనాతన ధర్మం తెలిసిన వ్యక్తివే అయితే చంద్రబాబు.. వేంకటేశ్వరస్వామి లడ్డూను అపహాస్యం చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నావు. అబద్ధం అని నీకు తెలిసినా ఎందుకు వ్యతిరేకించడంలేదు. ఆ అబద్ధంలో నువ్వు కూడా ఒక భాగంగా ఉన్నావు. ఇదేనా నీ సనాతన ధర్మం’’ అని పేర్కొన్నారు.

లడ్డూ వివాదంపై సిట్ అవసరం లేదు: జగన్

తిరుమల లడ్డూ వివాదం సీఎం చంద్రబాబు సృష్టించిన అబద్ధం అని తేలిపోయిందని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ వివాదంపై ఎలాంటి సిట్ దర్యాప్తు కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు కూడా దీనిని విశ్వసించిందని, అందుకే చంద్రబాబు వేసిన సిట్‌ను రద్దు చేసిందన్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామితో ఎవరైనా ఆడుకుంటే.. ఆ నష్టం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • CM Chandrababu
  • Pawan Kalyan
  • Supreme Court
  • ttd laddu
  • YCP vs TDP
  • ys jagan
  • ysrcp

Related News

Jagan

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని, కేవలం ప్రచారం కోసం లేదా రాజకీయ కారణాలతో ఇటువంటి పిల్స్ వేస్తున్నారా అని ఎంపీ గురుమూర్తిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

  • Amaravati

    అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

  • Ap Cm Chandrababu Naidu

    చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Supreme Court allows passive euthanasia for Harish Rana

    సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Latest News

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd