CM Jagan’s Daughter: మాస్టర్స్‌లో డిస్టింక్షన్‌తో పాసైన సీఎం జగన్ కూతురు హర్షిణి రెడ్డి.. ట్వీట్ వైరల్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
- Author : Anshu
Date : 02-07-2022 - 7:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థుల కోసం, రైతుల కోసం, అలాగే మహిళల కోసం ఎన్నోపథకాలను అమల్లోకి ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఒక వైపు తండ్రి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండగా మరొకవైపు జగన్ మోహన్ రెడ్డి కూతురు వైయస్ హర్షిణి రెడ్డి మాస్టర్స్ లో సత్తాను చాటి ఆంధ్ర పేరును నిలబెట్టింది.
హర్షిణి రెడ్డి ఫ్రాన్స్ రాజధాని అయిన పారిస్ కు చెందిన వర్సిటీలో మాస్టర్స్ విద్యను అభ్యసించింది. తాజాగా శనివారం ఆమె మాస్టర్స్ పట్టాను అందుకుంది. మాస్టర్స్ లో హర్షిణి రెడ్డి డిస్టింక్షన్‌తో తన సత్తాను చాటుకుంది. ఈ మేరకు హర్షి రెడ్డి వర్సిటీ పట్టా తీసుకుంటున్న వీడియోను వైయస్సార్సీపి డిజిటల్ మీడియా సోషల్ మీడియా విధిగా పంచుకుంది. కాగా కూతురు మాస్టర్స్ పూర్తి చేసిన పట్టా పుచ్చుకునే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి అలాగే భార్య ఇద్దరు కలసి పారిస్ కు వెళ్లారు.
Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022
కాగా తల్లిదండ్రుల సమక్షంలో హర్షిణి రెడ్డి పట్టాను పుచ్చుకుంది. అయితే ఇదే విషయాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ట్విట్ చేస్తూ తన కూతురికి అభినందనలు తెలిపాడు. కూతురు మాస్టర్స్ పట్టా అందుకోవడంతో జగన్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో హర్షిణి రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైయస్సార్సీపి అలాగే పలువురు నేతలు మెచ్చుకుంటూ కామెంట్స్ చేయగా సోషల్ మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.