YS Jagan : చంద్రబాబు అతి దుర్మార్గంగా లడ్డూ రాజకీయాలు చేస్తున్నారు : వైఎస్ జగన్
YS Jagan On Chandrababu 100 Days Government: చంద్రబాబుది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసం అని జగన్ పేర్కొన్నారు. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదు. వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే.. మోసమే అన్నారు.
- By Latha Suma Published Date - 04:26 PM, Fri - 20 September 24

YS Jagan On Chandrababu 100 Days Government: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసం అని జగన్ పేర్కొన్నారు. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదు. వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే.. మోసమే అన్నారు. అన్నీ వ్యవస్థలు తిరోగమనం చేస్తున్నారు. ఇలా మొట్ట మొదటిసారిగా చూస్తున్నానని తెలిపారు. గతంలో పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన అందేది. 9 నెలల్లో ఇంతవరకు ఏది అందలేదన్నారు.
Read Also: IND vs BAN 1st Test: 4 వికెట్లతో బంగ్లాను వణికించిన భూమ్ భూమ్ బుమ్రా
ప్రజలకు చెప్పినవన్ని కూడా అబద్దాల మూటగా 100 రోజుల తరువాత చంద్రబాబు దోషిగా నిలబడతారు. స్కూళ్లన్నీ పూర్తిగా నిర్వర్యమయ్యారు. రైతులు పూర్తిగా రోడ్డున పడ్డారు. రైతులకు అందాల్సిన సహాయం అందలేదు. మా హయాంలో ఇస్తామన్న పెట్టుబడి కూడా ఇవ్వలేదు. రైతులకు ఉచిత పంట బీమా లేదు. ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి అద్వానంగా మారింది. ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఏ రంగం చూసుకున్నా.. తిరోగమనమే అన్నారు. గతంలో ప్రతీ రంగంలో పారదర్శకంగా జరిగేది అని మాజీ సీఎం జగన్ తెలిపారు.
విజయవాడ వరదలు కూడా ప్రభుత్వం అలసత్వమే అని విమర్శించారు జగన్. వరద ప్రమాదం పొంచి ఉందని ముందే హెచ్చరించినా.. సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. బుడమేరు, ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ అని వాపోయారు. వీటిని డైవర్ట్ చేసేందుకు.. చంద్రబాబు ప్రకాశం బ్యారేజీలో బోట్లు అడ్డుపడ్డాయని కొత్త టాపిక్ తెచ్చారన్నారు. అసలు ఆ బోట్లను అక్కడ పెట్టుకున్నదే చంద్రబాబు అని, ఇసుక మాఫియా కోసమే చంద్రబాబు ఆ బోట్లను అక్కడ పెట్టుకున్నాడని ఆరోపించారు జగన్. అంతకుముందు ముంబయి నుంచి హీరోయిన్ కాదంబరి జత్వానీని తెచ్చి మరో డైవర్షన్ చేశారన్నారు.
Read Also: TTD : తిరుమల లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ప్రధాన పూజారి విచారం
చంద్రబాబు 100 రోజుల పాలనపై దృష్టి పెట్టడంతో.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశాడన్నారు. దేవుడిని కూడా తన స్వార్థానికి వాడుకునే చంద్రబాబు లాంటి దుర్మార్గమైన వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా ఉండడని సంచలన ఆరోపణలు చేశారు జగన్. 100 రోజుల పాలనలో ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబు అతి దుర్మార్గంగా లడ్డూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుతో చేసిన ఫ్యాట్ ను వాడారని ఆయన చేసిన ఆరోపణలు ధర్మమేనా అని ప్రశ్నించారు.
తిరుమలలో ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యికి టెండర్లు పిలుస్తారని, ఇది చాలా సాధారణమైన విషయం అన్నారు. లడ్డూ తయారీలో వాడే పదార్థాలు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయని, ఆరునెలల్లో ఎవరు ఎల్ 1గా వస్తారో వారికే ఇస్తారని తెలిపారు జగన్. లడ్డూ తయారీకి వాడే పదార్థాలకు క్వాలిటీ టెస్టులు మూడు దశల్లో జరుగుతాయని, అవన్నీ పాసయ్యాకే లడ్డూ తయారీకి వాడే పదార్థాలు తీసుకొచ్చే వెహికల్స్ ను ముందుకు పంపిస్తారని తెలిపారు. ఇన్ని టెస్టులు జరుగుతుంటే యానిమల్ ఫ్యాట్ వాడారని, నాసిరకం నూనె వాడారని రకరకాలుగా చెప్పడం ధర్మం కాదన్నారు.