HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >We Will Stand By Modiji In The Fight Against Terrorism Cm Chandrababu

CM Chandrababu : ఉగ్రవాదంపై పోరులో మోడీజీ కి అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

మోడీ ప్రధాని అయ్యేసరికి భారత్ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంది. భారత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది.

  • Author : Latha Suma Date : 02-05-2025 - 5:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
We will stand by Modiji in the fight against terrorism: CM Chandrababu
We will stand by Modiji in the fight against terrorism: CM Chandrababu

CM Chandrababu  : ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..గతంలో ప్రధాని మోడీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ మోడీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం అయ్యాయి అని చంద్రబాబు అన్నారు. మోడీ ప్రధాని అయ్యేసరికి భారత్ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంది. భారత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పేదరిక నిర్మూలనకు మోడీ కృషి చేస్తున్నారు. దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని చంద్రాబాబు తెలిపారు.

Read Also: Amaravati Relaunch : మోడీని పొగడ్తలతో ముంచెత్తిన నారా లోకేష్

నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతి 

గతంలో మోడీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. ఇటీవల మోడీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారు. పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటాం. మోడీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మోడీజీ మేమంతా మీకు అండగా ఉన్నాం అని చంద్రబాబు అన్నారు. భారత్‌ మాతాకీ జై అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. ప్రజలతోనూ సీఎం నినాదాలు చేయించారు. జూన్ 21న విశాఖలో యోగా డేకు ప్రధానిని ఆహ్వానిస్తున్నాం. నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేస్తాం. మోడీ సహకారంతో రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. మూడేళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి మోడీ రావాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట

సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పరిపాలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మోడీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు. కలగణన చేయాలని మోడీ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కులగణన చేయాలన్నది కేంద్రం తీసుకున్న గొప్ప నిర్ణయం. కూటమిగా పోటీచేసి 93 శాతం స్టైక్‌రేట్‌తో విజయం సాధించాం. వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోడీ సాయంతో గట్టెక్కిస్తున్నాయి. కేంద్రం సాయంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అన్నారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పట్టించాం. అమరావతి కేవలం నగరమే కాదు.. ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం అమరావతి. 29 వేలమంది రైతులు 34 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారు. అమరలింగేశ్వరస్వామి, కృష్ణానది, బౌద్ధారామాలకు నిలయం.. అమరావతి. వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు అనుభవించారు.

నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి

అమరావతి లాంటి ఉద్యమాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 2024లో ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంది. నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేస్తాం. మోడీ సహకారంతో రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. ప్రపంచంలోని అన్ని నగరాలకూ అమరావతిని అనుసంధానం చేస్తాం. అమరావతిలో 5 లక్షలమంది విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు.. భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నా. విద్య, వైద్య కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. హరిత ఇంధనంతో కాలుష్యరహిత నగరంగా అమరావతిని మారుస్తాం. ఇప్పటికే అత్యుత్తమ విద్యాసంస్థలు అమరావతికి వచ్చాయి. బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్ ఆర్ఐ వంటి మరిన్ని విద్యాసంస్థలు వస్తున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తవుతుంది. ఒక్క అమరావతినే కాదు.. అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తిచేస్తాం. భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాదికి పూర్తిచేస్తాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చినందుకు మోడీకి ధన్యవాదాలు. రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్ రాబోతున్నాయి. తిరుపతిని ఆధ్యత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం. కడపలో స్టీల్‌ప్లాంట్, రామాయపట్నంలో పోర్టు వస్తాయి. ఓర్వకల్లు నోడ్.. డ్రోన్ హబ్‌గా మారుతోందు. అమరావతి కోసం రైతులు వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లే అమరావతి పునః ప్రారంభమైందని సీఎం చంద్రబాబు అన్నారు.

Read Also: Minister Lokesh : భారత్‌ వద్ద మోడీ అనే మిసైల్‌ ఉంది..భారత్‌ గడ్డపై గడ్డి కూడా పీకలేరు: లోకేశ్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • Amaravati Sabha
  • CM Chandrababu
  • Modi Leadership
  • pm modi

Related News

VB-G RAM G

వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!

గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

  • Tdp Announces District Pres

    జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

  • Blue Turmeric

    ప్రియాంక గాంధీ చెప్పిన నీలి ప‌సుపు అంటే ఏమిటి? ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?

  • Sanatana Dharma

    దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • Jagan Allegations PM Modi

    ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

Latest News

  • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

  • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

  • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

  • బొత్స ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

  • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd