CM Chandrababu : 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు
ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారు. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు.
- By Latha Suma Published Date - 03:34 PM, Thu - 27 March 25

CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలోనే ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. అనంతరం సీఎం పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్నారని అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదిల్చలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.
Read Also: Tomato Price : కేజీ టమాటా రూ.2 ..కన్నీరు పెట్టుకుంటున్న రైతులు
కేంద్రాన్ని ఒప్పించి 7 మండలాలను ఏపీలో విలీనం చేశాం. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారు. ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారు. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు. నిన్నమొన్నటి వరకూ నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు లేడు. వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం అన్నారు.
2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తాం. మన ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసుకుందాం అని చంద్రబాబు అన్నారు. రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత మా ప్రభుత్వానిది. పోలవరంలో నీళ్లు వదిలే ముందే 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తిచేస్తాం. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటాం. నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది.
Read Also:CM Revanth Reddy : డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం