HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayasai Reddy Will Join Bjp In Next Week

Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?

విజయసాయిరెడ్డి చేరికతో ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ(Vijayasai Reddy) పెద్దలు భావిస్తున్నారట.

  • Author : Pasha Date : 02-04-2025 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayasai Reddy Bjp Ysrcp Ap Politics

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి.. వచ్చే వారమే బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో ఆయన సంప్రదింపులు పూర్తయ్యాయని అంటున్నారు.  ఈ ఏడాది జనవరి 25న వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన విజయసాయి.. ఇక వ్యవసాయం చేసుకుంటానన్నారు. ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేను’’ అని చెప్పారు. అంటే కచ్చితంగా భవిష్యత్తులో ఏదో ఒక పార్టీలో ఉంటారని తేలిపోయింది. అది కచ్చితంగా బీజేపీయే అని అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఆయనకు ఆ పార్టీలోనే పెద్దస్థాయి వరకు అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Also Read :Upasana : HCU అటవీ భూములపై వివాదం.. స్పందించిన రామ్ చరణ్ భార్య..

మూడు నెలలు గ్యాప్‌ ఇచ్చి..

వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశాక కనీసం మూడు నెలలు గ్యాప్‌ ఇచ్చి,  మరో పార్టీలో చేరితే బాగుంటుందని విజయసాయి భావించి ఉండొచ్చు. అందుకే ఈ నెలలోనే ఆయన కమలదళం కండువాను కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది.  వాస్తవానికి ఈ ఏడాది జూన్ లేదా జులైలో బీజేపీలో చేరాలని విజయసాయి అనుకున్నారట. అంత సుదీర్ఘ గ్యాప్ వల్ల చాలా అవకాశాలు చేజారుతాయని తెలుసుకొని.. ఆయన అలర్ట్ అయ్యారట. కాస్త తొందరపడితేనే కొన్ని రాజకీయ ప్రయోజనాలను అందుకోవచ్చని విజయసాయి డిసైడయ్యారట. విజయసాయి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం భర్తీకి ఈనెల (ఏప్రిల్)లోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.  అందుకే ఇదే సరైన సమయమని ఆయన భావించారట. ఈ టైంలో బీజేపీలో చేరి, రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారట. ఈనెల 4న పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనే బీజేపీలో చేరిక కోసం విజయసాయి కసరత్తు మొదలుపెట్టొచ్చు.

కాకినాడ సీపోర్టు వ్యవహారమూ కారణమేనా ? 

కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని మార్చి రెండోవారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు  ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు?, బలవంతంగా లాక్కున్నారా?, బలవంతంగా తీసుకుంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఎంతనే విషయాలను సాయిరెడ్డి నుంచి సీఐడీ అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఉదయం 11 నుంచి దాదాపు 3:30 గంటలపాటు సాయిరెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బహుశా ఈ వ్యవహారం కూడా విజయసాయిని బీజేపీలో చేరిక దిశగా నడిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

Also Read :Waqf Bill : వక్స్ చట్ట సవరణతో రాబోయే మార్పులు ఇవే..!

ఉత్తరాంధ్రపై బీజేపీ కన్ను

విజయసాయిరెడ్డి చేరికతో ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ(Vijayasai Reddy) పెద్దలు భావిస్తున్నారట. ఏపీలోని ఉత్తరాంధ్ర రాజకీయాలపై విజయసాయికి మంచి పట్టు ఉంది. అక్కడి నుంచి వైఎస్సార్ సీపీ కీలక నేతలను బీజేపీలోకి లాగేందుకు విజయసాయి తమకు సాయం చేస్తారని కమలదళం అగ్రనేతలు అనుకుంటున్నారు. రెడ్డి వర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలను బీజేపీకి చేరువ చేసే మాధ్యమంగా విజయసాయి ఉంటారని భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • ap bjp
  • ap politics
  • bjp
  • Vijayasai reddy
  • ysrcp

Related News

Sankranti Affect Private Tr

సంక్రాంతి ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్న ప్రవైట్ ట్రావెల్ కు రవాణా శాఖ భారీ షాక్

సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు

  • Ap Avakaya Festival

    రేపటి నుండి విజయవాడ లో ‘ఆవకాయ- అమరావతి’ ఉత్సవాలు

  • Bank Holiday

    ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు

  • Amith Sha Tvk

    విజయ్ పార్టీ తో బిజెపి పొత్తు?

  • Grama Sabhalu

    నేడు ఏపీ వ్యాప్తంగా గ్రామసభలు

Latest News

  • బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు

  • వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

  • మలబద్దకానికి సహజ పరిష్కారం: ఎండుద్రాక్ష–పెరుగు కలయికతో పొట్టకు ఉపశమనం

  • ధనుర్మాసంలో ఏ ఆలయాలకు వెళ్లాలో తెలుసా?

  • భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసా?

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd