HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayasai Reddy Met Andhra Pradesh Congress Chief Ys Sharmila Is That The Reason

Vijayasai Reddy : విజయసాయి రెడ్డి యూటర్న్.. ? షర్మిలతో భేటీ అందుకేనా ?

మూడు రోజుల క్రితమే విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) హైదరాబాద్‌లోని షర్మిల నివాసానికి వెళ్లారు.

  • Author : Pasha Date : 02-02-2025 - 6:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayasai Reddy Ys Sharmila Andhra Pradesh Congress Chief Ysrcp Ys Jagan

Vijayasai Reddy : వైఎస్ జగన్‌కు చెందిన వైఎస్సార్ సీపీకి గుడ్‌బై చెప్పిన విజయసాయి రెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏమిటి ?  ఆయన తదుపరిగా  ఏం చేయబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  మూడు రోజుల క్రితమే విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) హైదరాబాద్‌లోని షర్మిల నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆమెతో దాదాపు 3 గంటలపాటు సమావేశమయ్యారు. మధ్యాహ్నం అక్కడే భోజనం కూడా చేశారు. ఈసందర్భంగా ఏపీకి సంబంధించిన పలు రాజకీయ అంశాలపై షర్మిల, విజయసాయి చర్చించుకున్నారని తెలిసింది.

Also Read :Balakrishna Interview : పురంధేశ్వరి, భువనేశ్వరికి బాలయ్య ఇంటర్వ్యూ

రాజకీయకోణం దాగి ఉందా ?

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవలే బహిరంగంగా ప్రకటించిన విజయసాయి రెడ్డి.. కొన్ని వారాలైనా గడవకముందే ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిలతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఒకప్పుడు ఏపీని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇప్పుడు షర్మిల చేతిలోనే ఉన్నాయి. అందుకే షర్మిలతో విజయసాయి భేటీలో తప్పకుండా రాజకీయకోణం దాగి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై షర్మిలతో ఆయన డిస్కస్ చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read :Ayodhya : వెక్కివెక్కి ఏడ్చిన అయోధ్య ఎంపీ.. ప్రధాని మోడీతో మాట్లాడుతానంటూ..

ఆ పదవి కోసమేనా ?

ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, విశాఖ, పలు ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయాలపై విజయసాయి రెడ్డికి మంచి పట్టు ఉంది. భవిష్యత్తులో ఆయా ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ తరఫున కోఆర్డినేట్ చేసేలా ఏదైనా కీలక పదవిని విజయసాయి ఆశిస్తున్నారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు పెరుగుతాయి. వైఎస్సార్ సీపీలో ఉన్న చాలామంది విజయసాయి రెడ్డి సన్నిహితులు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం ఉండదు. ఈ అంశాలన్నీ సవివరంగా చర్చించుకునేందుకే  షర్మిల, విజయసాయి సమావేశం మూడు గంటల పాటు సాగి ఉంటుందని అంటున్నారు.  విజయసాయి రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారా ? రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండిపోతారా ? అనేది ఇంకొన్ని వారాల్లో మనందరికీ తెలిసిపోతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Congress Chief
  • congress
  • Vijayasai reddy
  • ys jagan
  • ys sharmila
  • ysrcp

Related News

Chikkamagaluru Farmers

Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిక్కమగళూరు లో మాత్రం బీన్స్ వ్యాపారులు అత్యంత తక్కువ ధ‌ర‌ల‌కు కొంటున్నార‌ని రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి చిక్కమగళూరులోని ఏపీఎంసీ యార్డు వద్ద వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టి..ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం వేశారు. ఈ విష‌యంపై జిల్లా యంత్రాంగం తక్షణమే జ

  • Chandrababu Naidu

    Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Apollo Hospitals' Dr. Preetha Reddy Meets CM Chandrababu

    Cm Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రీతారెడ్డి భేటీ

  • Religious Organizations Brought Under the Ambit of the RTI Act

    Andhra Pradesh: ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

  • Thalliki Vandanam

    Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్‌డేట్..

Latest News

  • Road Accident : కోదాడ స‌మీపంలో లారీని ఢీకొట్టిన ప్ర‌వేట్ ట్రావెల్స్ బ‌స్సు

  • Physical Relations: శారీరక సంబంధాలపై సర్వే.. షాకింగ్ విషయాలు వెల్లడి!

  • VIJAYAWADA : బెజ‌వాడ థార్ కారు కేసు.. ఇద్దరికీ రిమాండ్

  • Vastu Tips: ఆర్థిక సమస్యలు తొలగాలంటే… ఆదివారం నాడు ఇలా చేయండి..!!

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

Trending News

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd