Vallabhaneni Vamsi : ఒక రోజు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ
ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో వంశీపై కేసు నమోదైంది.
- By Latha Suma Published Date - 01:38 PM, Sat - 29 March 25

Vallabhaneni Vamsi : ఒకరోజు కస్టడీకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కంకిపాడు పీఎస్‌కు తరలించారు. కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూ కబ్జా కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు వల్లభనేని వంశీ ప్రశ్నిస్తున్నారు. కాగా, సత్యవర్ధన్ అపహరణ కేసులోనూ వంశీకి బెయిల్ దక్కలేదు. ఆయన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారం న్యాయస్థానం కొట్టివేసింది.
Read Also: Red Book: ఈ పేరు వింటే చాలు వారికీ గుండెపోటు వస్తోంది – లోకేష్
వైసీపీ నేత వల్లభనేని వంశీని గన్నవరం కోర్టు శుక్రవారం ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో వంశీపై కేసు నమోదైంది. ప్రస్తుతం వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 9 వరకూ సీఐడీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో వంశీ రిమాండ్ ముగియడంతో పోలీసులు ఆయన్ను విజయవాడలోని జిల్లా జైలు నుంచి తీసుకెళ్లి సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ పొడిగిండడంతో వంశీని తిరిగి విజయవాడ జిల్లా కారాగారానికి తరలించారు.
Read Also: Amit Shah : బడ్జెట్‌పై చర్చల్లో 42 శాతం సమయం ఆయనకే ఇచ్చారు: అమిత్ షా