Amit Shah : బడ్జెట్‌పై చర్చల్లో 42 శాతం సమయం ఆయనకే ఇచ్చారు: అమిత్ షా
కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కోటా ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హస్తం పార్టీ మతం ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.
- Author : Latha Suma
Date : 29-03-2025 - 12:55 IST
Published By : Hashtagu Telugu Desk
Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘టైమ్స్ నౌ సమ్మిట్ 2025’లో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై తాజాగా దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. సభలో మాట్లాడే సమయంలో ఆయన వియత్నాంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై చర్చల్లో మొత్తం సమయంలో 42 శాతం సమయం ఆయనకే ఇచ్చారు. పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు ఆయన వియత్నాంలో ఉన్నారు. తిరిగి వచ్చి మాట్లాడతానని పట్టుబట్టారు. పార్లమెంటు అన్నది వారి పార్టీలా కాకుండా, నిబంధనలకు అనుగుణంగా నడుస్తోంది. వారు సభా నియమాలు, నిబంధనలు పాటించాలి అని షా పేర్కొన్నారు.
Read Also: Dearness Allowance: 7వ పే కమిషన్‌లో డీఏ పెంచిన తర్వాత కనీస వేతనం ఎంతంటే?
సభలో మాట్లాడటానికి నియమాలు ఉన్నాయనే సంగతి బహుశా ప్రతిపక్ష నాయకుడికి తెలియకపోవచ్చు. సభలను ఇష్టానుసారం నడపలేము అన్నారు. కాగా, దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షా బదులిస్తూ.. నిజంగా ఎమర్జెన్సీ ఉంటే కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారన్నారు. కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కోటా ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హస్తం పార్టీ మతం ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.