Red Book: ఈ పేరు వింటే చాలు వారికీ గుండెపోటు వస్తోంది – లోకేష్
Red Book: రెడ్ బుక్ (RED Book) గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరికి గుండెపోటు వస్తోందని, మరికొందరు భయంతో హాస్పటల్స్ కు గురవుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు
- Author : Sudheer
Date : 29-03-2025 - 1:25 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం (TDP 43rd Foundation Day) సందర్భంగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh ) వైసీపీ నేతలపై(YCP Leaders) సెటైర్లు వేశారు. రెడ్ బుక్ (RED Book) గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరికి గుండెపోటు వస్తోందని, మరికొందరు భయంతో హాస్పటల్స్ కు గురవుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నారని గర్వం, ఇగోలు వద్దని, కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడాలని సూచించారు. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుడు అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ, చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజాసంక్షేమానికి అంకితమై పని చేస్తుందని తెలిపారు.
Uttam Kumar Reddy: గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రేపట్నుంచి సన్నబియ్యం పంపిణీ!
లోకేష్ తన ప్రసంగంలో టీడీపీ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ, దేశ రాజకీయాల్లో ఈ పార్టీ ప్రత్యేక ముద్ర వేసిందని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తెలియజేసిన పార్టీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశమని, ఐటీ, టెలికాం, విద్యుత్, హైవేల అభివృద్ధిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని వివరించారు. టీడీపీ నాయకత్వంలో పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి బీసీలకు రాజకీయ స్వాతంత్ర్యం కల్పించారని, అలాగే అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. 2019-2024 మధ్య కాలంలో టీడీపీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ప్రజల మద్దతుతో తిరిగి అధికారం దక్కించుకుందని వెల్లడించారు.
ప్రభుత్వంలోకి వచ్చిన 10 నెలల వ్యవధిలోనే 117 హామీలను అమలు చేసినట్లు తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, ముఖ్యంగా పెన్షన్ పెంపు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి గడచిన పదేళ్లలో రూ.140 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిందని, ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో వైసీపీకి భారీ పరాజయం తప్పలేదని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు టీడీపీ అంకితభావంతో పని చేస్తుందని, సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు సాగుతామని నారా లోకేష్ స్పష్టం చేశారు.