HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Universal Cancer Screening Programme Cbn

AP Govt : క్యాన్స‌ర్, గుండె పోటు మ‌హ‌మ్మారిల‌కు క‌ళ్లెం వేయ‌డానికి సిద్ధ‌మైన ఏపీ సర్కార్

AP Govt : మ‌న రాష్ట్రంలో ప్ర‌తి ఏడాదీ 73 వేల‌కు పైగా కొత్త క్యాన్స‌ర్ కేసులు న‌మోద‌వుతుండ‌గా 40 వేల‌కు పైగా మృతి చెందుతున్నారు

  • Author : Sudheer Date : 05-11-2024 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Universal Cancer Screening
Universal Cancer Screening

క్యాన్స‌ర్, గుండె పోటు (Cancer, Heart attack) వ‌ల‌న దేశంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా మ‌ర‌ణాలు రోజురోజుకూ పెరగ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌న రాష్ట్రంలో ప్ర‌తి ఏడాదీ 73 వేల‌కు పైగా కొత్త క్యాన్స‌ర్ కేసులు న‌మోద‌వుతుండ‌గా 40 వేల‌కు పైగా మృతి చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా 14 ల‌క్ష‌ల కొత్త క్యాన్స‌ర్ కేసులు న‌మోద‌వుతుంటే 9 ల‌క్ష‌ల మంది మృత్యు బారిన ప‌డుతున్నారు. రాష్ట్రంలో క్యాన్స‌ర్ చికిత్స‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త ఆర్థిక సంత్స‌రంలో రూ.680 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసింది.

సార్వ‌త్రిక క్యాన్స‌ర్ ప‌రీక్ష‌ల కార్య‌క్ర‌మం :

ప్ర‌బ‌లుతున్న క్యాన్స‌ర్ వ్యాధిని అరిక‌ట్ట‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం న‌డుంక‌ట్టింది. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డానికి ఉద్దేశించిన “సార్వ‌త్రిక క్యాన్స‌ర్ ప‌రీక్ష‌ల కార్య‌క్ర‌మాన్ని” (Universal Cancer Screening Programme) రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు (CM CHandrababu) బుధ‌వారం నాడు ప్రారంభించ‌నున్నారు. ఇందులో భాగంగా క్యాన్స‌ర్ మృతికి ప్ర‌ధాన కార‌కాలైన నోటి క్యాన్స‌ర్‌, రొమ్ము క్యాన్స‌ర్‌, గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార (స‌ర్వైక‌ల్‌) క్యాన్స‌ర్ ప‌రీక్ష‌ల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేప‌డ‌తారు. 18 ఏళ్లు దాటిన ప్ర‌తి ఒక్క‌రూ ఈ ప‌రీక్ష చేయించుకోవాల‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోంది.

రాష్ట్ర‌వ్యాప్తంగా క‌మ్యూనిటీ హెల్త్ ఆఫీస‌ర్లు (సిహెచ్వోలు), ఎఎన్ ఎంలు ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడు ర‌కాల క్యాన్స‌ర్ ప‌రీక్ష‌లు చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన యాప్ స‌హాయంతో క్యాన్స‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్ని ప్ర‌భుత్వ బోధానాసుప‌త్రులు మ‌రియు య‌న్టీఆర్ వైద్య సేవ‌లో భాగ‌స్వాములైన ఆసుప‌త్రుల‌కు పంపి అక్క‌డ చికిత్స పొందే ఏర్పాటు క‌ల‌గ‌జేస్తారు. క్యాన్స‌ర్ కు గురై చికిత్స కోసం వెళ్లే ప్ర‌తి రోగి వెంట ఆశా కార్య‌క‌ర్త ఉంటారు. మొద‌ట్లోనే క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల్ని గుర్తించడం వ‌ల్ల స‌కాలంలో చికిత్స‌ను అందించ‌డంతో పాటు వ్యాధికి గురైన వారు అతి స్వ‌ల్ప ఖ‌ర్చుతో కోలుకునే వీలుంటుంది.

స్టెమి ( ఎస్టీ-ఎలివేష‌న్ మ‌యోకార్డియ‌ల్ ఇన్‌ఫార్క్‌ష‌న్ )

గుండె నొప్పి సంకేతం అందిన కీల‌క‌మైన మొద‌టి గంట స‌మ‌యంలో త‌గు చ‌ర్య‌లు తీసుకుంటే గుండె పోటు మ‌ర‌ణాల్ని నివారించ‌వ‌చ్చ‌న్న శాస్త్ర సాంకేతిక అంశం ఆధారంగా ఈ దిశగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా స్టెమి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. గుండె పోటు వ‌ల్ల గుండె కండ‌రాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని త‌గ్గించి బాధితుల్ని ర‌క్షించ‌డం ఈ కార్య‌క్ర‌మం ముఖ్యోద్దేశం.

238 స్పోక్స్‌(క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్లు, ఏరియా ఆసుప‌త్రులు, జిల్లా ఆసుప‌త్రులు) మ‌రియు 37 హ‌బ్ ఆసుప‌త్రులు( 11 ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌నాసుప‌త్రులు, 26 య‌న్టీఆర్ వైద్య సేవా ప్రైవేట్ ఆసుప‌త్రులు) ద్వారా ఈ కార్య‌క్ర‌మం అమ‌లుకానుంది. ఈ కార్య‌క్ర‌మం అమ‌లుకు కూడా ప్ర‌త్యేక యాప్‌ను రూపొందించారు. గుండె నొప్పి వ‌చ్చిన వ్య‌క్తి ఆ స‌మాచారాన్ని స్పోక్ ఆసుప‌త్రికి తెలియ‌జేస్తే అక్క‌డ ఉన్న వైద్యాధికారి వెంట‌నే ఇసిజి తీసి మొబైల్ యాప్ ద్వారా హ‌బ్ ఆసుప‌త్రికి ప‌రిస్థితిని తెలియ‌జేస్తారు. హ‌బ్ ఆసుప‌త్రిలో ఉండే హుద్రోగ నిపుణుడు నివేదిక‌ను ప‌రిశీలించి, గుండెకు రక్త ప్ర‌స‌ర‌ణ స‌రిగా జ‌రిగేందుకు అవ‌స‌రం మేర‌కు టెనెక్టిప్లేజ్ ఇంజ‌క్ష‌న్ చేయ‌డంపై స‌ల‌హా ఇస్తారు. ఈ ఇంజ‌క్ష‌న్ అనంత‌రం రోగి ప‌రిస్థితి సాధార‌ణ స్థితికి వ‌చ్చిన వెంటనే రోగిని త‌గు చికిత్స‌కోసం హ‌బ్ ఆసుప‌త్రికి పంప‌డం జ‌రుగుతుంది. ఎంతో కీల‌క‌మైన ఈ ఇంజ‌క్ష‌న్ ఖ‌రీదు రూ.45,000.

ఈ విధంగా గుండె నొప్పి సంకేతం అందిన వెంట‌నే బాధితుని గుండెకు ర‌క్త స‌ర‌ఫ‌రాలో అడ్డంకుల్ని తొల‌గించి చికిత్స‌కు వీలు క‌లిగించ‌డం వ‌ల్ల ప్రాణ ర‌క్ష‌ణ వీల‌వుతుంది. ఈ రెండు ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల అమ‌లుకు సంబంధించిన వివిధ అంశాల్ని వైద్య, ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎం.టి.కృష్ణ‌బాబు మ‌రియు సంబంధిత ఉన్న‌తాధికారుల‌తో మంగ‌ళ‌వారం నాడు విస్తృతంగా చ‌ర్చించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cancer
  • CM Chandrababu
  • heart attack
  • Universal Cancer Screening Programme

Related News

    Latest News

    • Kadapa : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించేందుకు భార్య ప్లాన్

    • Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

    • YCP MLC అనంతబాబు అరెస్ట్

    • RTC Driver Suicide : డ్రైవర్ కుటుంబానికి రూ.10లక్షలు, ఉద్యోగం..ప్రభుత్వం ప్రకటన

    • WB Elections : TMC నేతలను గుండాలతో పోల్చిన మోడీ

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd