HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Today Is The Death Anniversary Of Ys Vivekananda Reddy Vivekas Daughter Sunitha Key Comments

YS Viveka : సాక్షుల మరణాలపై అనుమానం ఉంది.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు

2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య జరిగింది. 

  • Author : Pasha Date : 15-03-2025 - 10:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Vivekananda Reddy Death Anniversary Ys Sunitha Reddy

YS Viveka : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షుల మరణాలపై తమకు అనుమానం ఉందని ఆమె తెలిపారు.  ఈ కేసులోని సాక్షులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని సునీత ఆరోపించారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. ఇవాళ వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి. ఈ సందర్భంగా పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో సునీత మాట్లాడారు.

Also Read :Men Vs Marriage : పురుషుల బరువుకు పెళ్లితో లింకు.. సంచలన నివేదిక

నిందితులంతా బయటే తిరుగుతున్నారు

‘‘మా నాన్న హత్యకు గురై ఆరేళ్లు అయింది. ఈ కేసులో ఇంకా మాకు న్యాయం జరగలేదు. సీబీఐ కోర్టులో విచారణ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగితా వాళ్లంతా బయటే తిరుగుతున్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు మొదలు పెడుతుందని ఆశిస్తున్నా. సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులైన వారు మేనేజ్ చేస్తున్నారనే అనుమానం వస్తోంది’’ అని వైఎస్ సునీతా రెడ్డి పేర్కొన్నారు.‘‘ఈ కేసులో నిందితుల కంటే.. మాకు, మా కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోంది. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి’’ అని ఆమె తెలిపారు.

Also Read :Telangana Debts: తెలంగాణ అప్పులు, ఖర్చులు, ఆర్థిక లోటు.. కొత్త వివరాలివీ

హత్య.. దర్యాప్తు.. 

  • 2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య జరిగింది.
  • ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. టీడీపీపై ఆరోపణలు చేశారు.  సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
  • ఆ ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎం అయ్యాక.. వివేకా హత్య కేసును జగన్ అంతగా పట్టించుకోలేదు.
  • వివేకా హత్య కేసుపై నాటి జగన్ సర్కారు ఫోకస్ చేయకపోవడంతో వివేకా కుమార్తె సునీతకు అనుమానం వచ్చింది.
  • వైఎస్ సునీతారెడ్డి సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. దీనికి ఏపీ హైకోర్టు అంగీకారం తెలిపింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ జరుగుతోంది.
  • సీబీఐ విచారణ మొదలయ్యాకే.. వివేకాది గుండెపోటు కాదని హత్య అని తేలింది.
  • ఈ కేసులో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైసీపీ కీలక నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిపై సీబీఐ చార్జిషీట్‌ నమోదు చేసింది.
  • నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయాడు. అసలు విషయాలన్నీ బయటపెట్టాడు.
  • ఈ కేసులో పలువురు అరెస్టయి, బెయిల్‌పై విడుదలయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Viveka Death Anniversary
  • Vivekas Daughter
  • ys jagan
  • YS Sunitha Reddy
  • YS Viveka
  • YS Vivekananda Reddy

Related News

Jagan Vijay

జగన్ తో TVK విజయ్..ఫ్యాన్స్ లో ఆసక్తి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక చెన్నైలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన వారు కూడా హాజరయ్యారు

  • YS Jagan Visit Jogi Ramesh House Ibrahimpatnam Vijayawada

    జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్

  • Ys Jagan To Visit Jogi Rame

    అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్ ! గుంటూరు లో ఏంజరుగుతుందో ?

Latest News

  • నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!

  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

  • FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

  • టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd