Also Read :Suravaram Pratapareddy: తెలుగు వర్సిటీకి ‘సురవరం’ పేరు.. తెలంగాణ వైతాళికుడి జీవిత విశేషాలివీ
బీఆర్ఎస్ పాలనా వైఫల్యంతో..
తాము తెస్తున్న అప్పులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల(Telangana Debts) కిస్తీలు, వడ్డీలను చెల్లించేందుకు.. కాంట్రాక్టర్ల పాత బిల్లులను కట్టేందుకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబరు 7న గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. అప్పటివరకు బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పుల భారం రూ.6.71 లక్షల కోట్లు అని ప్రకటించింది. ఆనాడు బీఆర్ఎస్ సర్కారు పాలనా వైఫల్యం వల్ల అప్పులు పేరుకుపోయాయి. అందుకే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ సర్కారు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం రుణంగా తెస్తున్న డబ్బులను మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకాల అమలు, ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులు, పాత అప్పుల వడ్డీల చెల్లింపులకు వెచ్చిస్తున్నారు. బీఆర్‌ఎస్ కాలం నాటి పాత అప్పు రూ.6,71,757 కోట్లు. గత 15 నెలల్లో కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పు రూ.1.52 లక్షల కోట్లు. ఇవన్నీ కలిపితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అప్పు దాదాపు రూ.8,24,575 కోట్లుగా ఉంటుంది.