HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Three Helicopters Spotted Flying Over Tirumala Temple

Tirumala Temple: తిరుమలలో ఒకేసారి మూడు హెలికాప్టర్ల చక్కర్లు కలకలం.. శ్రీవారి ఆలయం సమీపం నుంచే హెలికాప్టర్లు..!

తిరుమల కొండ (Tirumala Temple)పై హెలికాప్టర్లు (Helicopters)చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు హెలికాప్టర్లు కొండపైకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  • Author : Gopichand Date : 26-04-2023 - 6:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala Temple
Resizeimagesize (1280 X 720)

తిరుమల కొండ (Tirumala Temple)పై హెలికాప్టర్లు (Helicopters)చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు హెలికాప్టర్లు కొండపైకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం ఆలయ సమీపంలోని ప్రాంతంలో హెలికాప్టర్లు ఎగురుతూ కనిపించాయి. తిరుమల నో ఫ్లైయింగ్ జోన్ అన్న సంగతి తెలిసిందే. నో ఫ్లైయింగ్ జోన్‌లో ఏమీ ప్రయాణించకూడదనే నిబంధన ఉంది. అయితే ఈ హెలికాప్టర్లు శ్రీవారి ఆలయ సమీపం నుంచే వెళ్లడం గమనార్హం.

శ్రీవారి ఆలయం సమీపం నుంచే హెలికాప్టర్లు వెళ్లినట్టుగా తెలుస్తోంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి భవనం, బాలజీనగర్ ఉపరితలంపై నుంచి హెలికాప్టర్‌లు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు హెలికాప్టర్ల గురించిన వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా, తిరుమల కొండపై నుంచి వెళ్లిన హెలికాప్టర్లు వైమానిక దళానికి చెందినవని అధికారులు గుర్తించారు. కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల మీదుగా హెలికాప్టర్లు వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: Heavy Rains: భారీ వడగళ్ల వర్షం.. పలు జిల్లాల్లో బీభత్సం!

అయితే నో ఫ్లైయింగ్ జోన్‌లో హెలికాప్టర్‌ను ఎలా అనుమతించారనేది ప్రశ్నార్థకంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తిరుమల కొండపైకి హెలికాప్టర్లు వెళ్లడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. అసలు హెలికాప్టర్లు కొండపై నుంచి వెళ్లడానికి కారణమేమిటనే దానిపై విచారణ చేపట్టారు. ఈ విషయమై ఎయిర్‌పోర్టు అధికారులతో చర్చించినట్లు సమాచారం. కడప నుంచి చెన్నై వెళ్తున్న వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, గతంలో తిరుమలలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుమలలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా చేపట్టిన సర్వేకు ఓ కంపెనీ డ్రోన్లను వినియోగించడం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Helicopters
  • No Flying Zone
  • Three Helicopters
  • tirumala
  • Tirumala Temple
  • ttd

Related News

Tirumala Laddu

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Tirumala Laddu  తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ

  • Tirumala Aksharabhyasam Akshara Govindam

    భక్తులకు శుభవార్త.. బాసర తరహాలో తిరుపతిలో అక్షర గోవిందం పథకం

  • Tirumala Devotees

    Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd