CM Jagan Nomination: సీఎం జగన్ నామినేషన్ తర్వాత ప్రచార బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ భారతి..?
ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Nomination) మేమంతా సిద్ధం అనే సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
- Author : Gopichand
Date : 12-04-2024 - 9:35 IST
Published By : Hashtagu Telugu Desk
CM Jagan Nomination: ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Nomination) మేమంతా సిద్ధం అనే సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కూడా ఉమ్మడి సభలతో ప్రచారానికి తెరలేపింది. ఈ సభల్లో హామీలు, విమర్శలు, ఆరోపణ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇకపోతే అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18
ఇకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తాజాగా ఓ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఏ రోజు విడుదల చేయనున్నారో ఆయన తెలిపారు. ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్, నామినేషన్, వాటి ఉపసంహరణ తేదీలను కూడా ప్రకటించారు.
ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో ఈనెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజు నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్ 26 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ తెలిపారు. ఇకపోతే ఏపీలో మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఎన్నికల అధికారులు మొదలు పెట్టారు.
ఏప్రిల్ 22న జగన్ నామినేషన్
ఈ క్రమంలోనే ఈ నెల 22న సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 10.30 గంటలకు సీఎం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21న కుటుంబంతో కలిసి జగన్ పులివెందులకు రానున్నారు. జగన్ నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచార భాద్యతలు సీఎం సతీమణి వైఎస్ భారతీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వైఎస్ భారతీ పులివెందులలోనే మకాం వేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వైఎస్ భారతి సారధ్యంలోనే వైసీపీ ప్రచార పర్వం కొనసాగనుంది.
We’re now on WhatsApp : Click to Join