Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
- By Vamsi Chowdary Korata Published Date - 03:35 PM, Tue - 28 October 25
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్‌కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు చేసింది. తమ రాష్ట్రం ప్రతిభతో పెట్టుబడులను ఆకర్షిస్తే.. ఏపీ మాత్రం 15 ఏళ్లు ఉచిత విద్యుత్, 10 ఏళ్లు 2శాతం ధరకే నీరు, 100 శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ వంటి భారీ ప్రలోభాలతో గూగుల్‌ను లాగేసిందని ఆరోపించింది.
విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ సర్కారు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని ముందుగా కర్ణాటకలో పెట్టాలని భావించిన గూగుల్.. ఆ తర్వాత దీన్ని ఏపీకి మార్చింది. అయితే తాజాగా ఈ అంశంపై కర్ణాటక కాంగ్రెస్ స్పందించింది. తమ రాష్ట్రం గూగుల్ సంస్థను కోల్పోలేదని కర్ణాటక కాంగ్రెస్ కోల్పోలేదని.. మరో రాష్ట్రం దానిని ప్రలోభాలతో ఆకర్షించి తీసుకుపోయిందని ఏపీని ఉద్దేశించి మాట్లాడింది. దాదాపు 15 బిలియన్ల డాలర్ల భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,20,000 కోట్లకు పైగా విలువైన గూగుల్ డేటా సెంటర్‌ను మరో రాష్ట్రానికి దారి మళ్లించారని ఆరోపించింది. దీనికి కారణం ప్రతిభ ఎంతమాత్రం కాదని.. ఇతర కారణాలు ఉన్నాయని పేర్కొంది.
ముఖ్యంగా గూగుల్‌కు ఆ రాష్ట్రం అందించిన ఆఫర్లు ఇవే అంటూ ఓ పెద్ద జాబితానే రాసుకొచ్చింది. అందులో.. 15 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ సరఫరా ఒకటని, 10 సంవత్సరాల పాటు నీటిని 25 శాతం ధరకే అందించడం రెండోదని తెలిపింది. అలాగే 480 ఎకరాల భూమిని అతి తక్కువ ధరలకు కేటాయించడం, రూ.2,245 కోట్ల విలువైన 100 శాతం ఎస్జీఎస్టీ చెల్లింపును తిరిగి ఇవ్వడం కూడా అందులో ఉన్నాయని చెప్పింది. ఇది పెట్టుబడిని ఆకర్షించే మెరిట్ కాదని.. కేవలం దాన్ని లాక్కోవడానికి చేసిన కుతంత్రమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
To all the self-proclaimed experts, WhatsApp graduates, and noise-makers who bark before they think, here are some facts you can’t spin.
Karnataka didn’t lose Google, it was “lured” away. A $15 billion Google Data Centre was diverted to another state, not for “talent,” but other…
— Karnataka Congress (@INCKarnataka) October 27, 2025
ఇలాంటి అధిక వ్యయంతో కూడుకున్న ప్రలోభాలను మేము మా ప్రజలపై భారం మోపేందుకు ఎన్నటికీ అంగీకరించమని చెప్పుకొచ్చింది. ఎందుకంటే దీనివల్ల రాష్ట్రంపై పడే భారం, ప్రజలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అని తెలిపింది. అంతేకాకుండా తాము పెట్టుబడుల కోసం ఎవరినీ యాచించమని, బ్రతిమాలము, బలవంతం చేయమని వెల్లడించింది. తమ రాష్ట్రం భారతదేశంలో ఎఫ్డీఐలో మొదటి స్థానంలో ఉంది కాబట్టే.. తాము పెట్టుబడులను సహజంగానే ఆకర్షిస్తామని వివరించింది. తాము భారత దేశానికి టెక్ క్యాపిటల్‌గా ఉన్నామని గుర్తు చేసింది. అసాధ్యమైన రాయితీలు లేదా ఉచితాల ద్వారా కాకుండా.. తమ అద్భుతమైన ప్రతిభ, ఆవిష్కరణ, నిజాయితీ ద్వారా తాము పెట్టుబడిదారులను ఆకర్షిస్తామని పునరుద్ఘాటించింది.
#AndhraPradesh’s progress seems to have turned into Karnataka Congress’s favourite topic. Looks like our growth is a little too spicy for them! #FeelingTheBurn 🌶️ https://t.co/PwwjLrLfv0
— Telugu Desam Party (@JaiTDP) October 28, 2025
కాబట్టి నీతులు బోధించే ముందు మీరంతా వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పుకొచ్చింది. కర్ణాటక అవకాశాల కోసం ఎవరినీ యాచించదని, లంచాలు ఇవ్వలేదని ఎక్స్ వేదికగానే స్పష్టం చేసింది. తమ అవకాశాలను తామే సృష్టించుకుంటామని మరోసారి వెల్లడించింది. అయితే కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై టీడీపీ స్పందించింది. ఎక్స్ వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రగతి.. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఇష్టమైన చర్చా అంశంగా మారినట్లుందని తెలిపింది. తమ అభివృద్ధి వేడి వారికి కొంచెం మంటలా మారుతున్నట్లు కనిపిస్తోందని చెప్పింది. అక్కడితో ఆగకుండా వారికి మండిపోతున్నట్లుందని కూడా రాసుకొచ్చింది. ఈ రిప్లైపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు టీడీపీకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు కర్ణాటకకు మద్దతిస్తున్నారు.