HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Follows Ap Cm Jagan In A Particular Issue

Chandrababu Naidu: ఆ విషయంలో చంద్రబాబు కూడా జగన్ నే ఫాలో అవుతున్నారా?

టీడీపీ మహానాడును చూసినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంతమంది జనంతో తెలుగుదేశం పార్టీ ఏ సభను నిర్వహించలేదు.

  • Author : Hashtag U Date : 29-05-2022 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Check your Vote
Jagan chandrababu naidu

టీడీపీ మహానాడును చూసినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంతమంది జనంతో తెలుగుదేశం పార్టీ ఏ సభను నిర్వహించలేదు. పైగా చంద్రబాబు కూడా ఇలాంటి జనసమీకరణను ప్రోత్సహించిన సందర్భమూ లేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడం, పైగా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కూడా వెలువడుతుండడంతో టీడీపీ కూడా జాగ్రత్తపడింది. కానీ అది ఊహించిన దానికంటే.. రెండుమూడు రెట్లు ఎక్కువగా ప్రజలు మహానాడు బహిరంగ సభకు రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు.

మహానాడు చివరిరోజున ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆరోజు మధ్యాహ్నం నాటికే 3 లక్షల మందికి పైగా ప్రజలు తరలివచ్చారని.. ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు.. ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. సభకు చుట్టుపక్కల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో దాదాపు మరో రెండు లక్షల మంది అందులో ఇరుక్కుపోయి ఉంటారని అంచనా వేసినట్లు సమాచారం. అంటే ట్రాఫిక్ లేకుండా, సమయానికి వారు కూడా సభా ప్రాంగాణానికి చేరుకుని ఉంటే.. సుమారు ఐదు లక్షల మంది ఆ సభకు హాజరైనట్టు లెక్క.

ఒక సభకు మూడు లేదా ఐదు లక్షల మంది హాజరవ్వడం అంటే మాటలు కాదు. అది కూడా ప్రతిపక్షాల సభకు అంతమంది రావడం కష్టం. కానీ టీడీపీకి సభకు వచ్చారంటే ఏపీలో పొలిటికల్ లెక్కలు మారుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. జగన్ సర్కారు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆదరణ లేకపోవడం, పైగా ఎమ్మెల్యేలు, మంత్రులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుండడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే దానికి బదులుగా మంత్రులు బస్సు యాత్రను చేపట్టారు. కానీ ఆ యాత్రకూ ఆదరణ కరువైంది. వైసీపీ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

ఇలాంటి సమయంలో టీడీపీ సభకు ఇంత భారీగా జనాలు తరలి వచ్చారంటే.. లెక్క మారుతోంది అని వైసీపీ వర్గాలు కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి గత ఎన్నికలకు ముందు జగన్ తన సభల్లో ఎక్కువమంది జనం ఉండేలా చూసుకునేవారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారంటున్నారు విశ్లేషకులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • chandrababu naidu
  • cm jagan
  • tdp
  • ysrcp

Related News

Mounika to Contest Upcoming Elections: Manchu Manoj Clarifies

Bhuma Mounika Reddy: వచ్చే ఎన్నికల్లో మౌనిక అక్కడి నుంచే పోటీ.. క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని వెల్లడించారు. తాము ప్రస్తుతం రాజకీయాల్లో భాగమయ్యామని తెలిపారు. రేపు (మే 20న) తన పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఇటీవలే తాను ప్రారంభించిన ‘ఐఖ్య’ (AIKYA… Dhairya Sena Samithi) సంస్థపై వస్తున్న సందేహాలకు ఈ సందర్భంగా ఆయన సమాధానమిచ్చారు. ‘

  • Ambati Rambabu takes satirical digs at Pawan

    Ambati Rambabu: పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు

  • Nandyal MP Byreddy Shabari Lashes Out at YCP Leaders

    Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్

Latest News

  • Relationship: రాత్రిళ్లు దంపతులు కౌగిలించుకుని పడుకుంటే కలిగే లాభాలివే

  • US Inflation: అమెరికాను వణికిస్తున్న నిత్యావసర ధరల

  • AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

  • Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

  • Mega 158: మెగాస్టార్​ చిరంజీవి 158వ సినిమా మొదలు

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd