Vijayawada: విజయవాడలో బలహీన పడుతున్న తెదేపా
కేశినేని వెళ్లిపోవడంతో విజయవాడలో టీడీపీ పరిస్థితి క్లిష్టంగా మారింది. స్థానిక నేతలు వైసీపీలోకి భారీగా వచ్చి చేరుతున్నారు. దీంతో నగరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. తాజాగా విజయవాడలో టీడీపీకి భారీ షాక్ ఎదురైంది
- Author : Praveen Aluthuru
Date : 27-03-2024 - 3:10 IST
Published By : Hashtagu Telugu Desk
Vijayawada: కేశినేని వెళ్లిపోవడంతో విజయవాడలో టీడీపీ పరిస్థితి క్లిష్టంగా మారింది. స్థానిక నేతలు వైసీపీలోకి భారీగా వచ్చి చేరుతున్నారు. దీంతో నగరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. తాజాగా విజయవాడలో టీడీపీకి భారీ షాక్ ఎదురైంది. టీడీపీ మాజీ కార్పొరేటర్లు గండూరి మహేశ్, నందెపు జగదీష్‌తో పాటు మాజీ కో-ఆప్‌సభ్యురాలు కొక్కిలిగడ్డ దేవమణి, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి కోసూరు సుబ్రహ్మణ్యంతో పాటు విజయవాడ నగర పరిధిలోని టీడీపీ మాజీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలో చేరారు .
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గోరంట్ల శ్రీనివాసరావు, బత్తిన రాము, ఇతర ప్రముఖులకు సీఎం జగన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. .ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రుహుల్లా, తూర్పు నియోజకవర్గ వైస్‌ఆర్‌సీ అభ్యర్థి దేవినేని అవినాష్‌తో పాటు పార్టీ నాయకులు యలమంచలి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ పరిణామం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
Also Read: Sania Mirza – MP Candidate : కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా ?