HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Survey Game In Narsapuram Politics

Narsapuram:పొలిటికల్ ‘ఆత్మ’ సర్వే ఆట

నరసాపురం ఉప ఎన్నికల ఫలితాలపై సర్వేల గేమ్ మొదలు అయింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫలితాలను అంచనా వేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియకుండానే పార్టీల వారీగా ఓటు శాతాన్ని లెక్కిస్తున్నారు.

  • By CS Rao Published Date - 04:44 PM, Wed - 19 January 22
  • daily-hunt
Rahu
Rahu

నరసాపురం ఉప ఎన్నికల ఫలితాలపై సర్వేల గేమ్ మొదలు అయింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫలితాలను అంచనా వేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియకుండానే పార్టీల వారీగా ఓటు శాతాన్ని లెక్కిస్తున్నారు. ఆత్మసాక్షి సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం సింగిల్ గా టీడీపీ గెలుస్తుంది. జనసేనతో కలసి వెళ్తే లక్షల్లో మెజార్టీ కనిపిస్తుంది. స్వతంత్ర అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేసినా 50వేల మెజార్టీతో గెలుస్తాడాని ఆ సర్వే సారాంశం. జగన్ ప్రభుత్వం మీద ఎస్సీ లు కూడా 3 శాతం ప్రతికూలంగా ఉన్నారని ఆత్మసాక్షి భావిస్తుంది.ఆత్మసాక్షి సర్వే వారు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సర్వే చేయగా,ఇండివిడ్యుల్ గా చూసినట్లయితే తెలుగుదేశం 36.8 శాతం, వైయస్సార్ పార్టీ 36.3 శాతం ఓట్లను అంచనా వేస్తున్నారు. ఇక జనసేన 23.9 శాతం, బిజెపి 0.68 శాతం, కమ్యూనిస్టులకు 1.72 శాతం, ఇతరులకు 0.65 శాతం రావొచ్చని తేల్చారు.రైతులు, ఆక్వా రైతులు, నిరుద్యోగులు, సర్పంచులు, రోజువారి కూలీలు, పెన్షనర్లు మరియు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.ఎస్సీ కమ్యూనిటీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా వారిలో కూడా 3% వ్యతిరేకంగా వెళ్ళిపోయినారు.అన్ని కమ్యూనిటీ లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరణాలు మారుతున్నాయని అంచనా వేసింది.ఉన్న ఏడు నియోజకవర్గాల లోనూ, ఎలక్ట్రిసిటీ చార్జెస్, హౌస్ టాక్స్, గ్యాస్, డీజిల్, పెట్రోల్ , నిత్యవసర వస్తువులు మరియు శాండ్ పాలసీగురించి విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది.ప్రతి ఊరిలోనూ అభివృద్ధి రోడ్లు డ్రైన్లు శానిటేషన్ పనులు ఏవి జరగకపోవడం గురించి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మూడు రాజధానులు కు వ్యతిరేకంగా అమరావతి కి అనుకూలంగా 68.5 శాతం మంది, మూడు రాజధానులు అనుకూలంగా 22.5 శాతం మంది, తటస్థంగా 9.5 శాతం మంది ఉన్నారు. అన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ 3 నుంచి 5 వేల మెజారిటీతో గెలుస్తుంది. తెలుగుదేశం మరియు జనసేన కలిస్తే లక్షా 20 వేల నుంచి లక్ష 30 వేల వరకు మెజారిటీ రావచ్చు.తెలుగుదేశం జనసేన మరియు బిజెపి కలిస్తే 75 వేల నుంచి 50 వేల వరకు మెజారిటీ వస్తుంది అంటే మెజారిటీ తగ్గుతుంది.రఘురామకృష్ణంరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 60 నుంచి 65 వేల మెజారిటీ వస్తుంది.ఈ సర్వే ను వైసీపీ వర్గాలు చేయించారని సోషల్ మీడియా టాక్. బీజేపీ, జనసేన , టీడీపీ కలిసి పోటీలోకి వెళ్తే తక్కువ ఓట్లు వస్తాయని తేల్చింది. అంతే కాదు , టీడీపీ అభ్యర్థిగా త్రిబుల్ ఆర్ పోటీ చేస్తే కేవలం 5 వేల మెజార్టీ తో బయట పడతాడట. అదే ఇండిపెండెంట్ గా చేస్తే 50వేల మెజార్టీ అంట. ఇలాంటి మైండ్ గేమ్ సర్వే ఎవరిదో..అందుకు సోషల్ మీడియా లో విడుదల చేశారో ..ఈజీగా అర్థం అవుతోంది. ఇలాంటి సర్వేలతో బెట్టింగ్ రాయుళ్లను సమాయత్తం చేయడం మినహా నిజాలు తక్కువగా ఉన్నాయని భోధపడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి సర్వేలు ఎవరికి తోచినవి వాళ్ళు బయటకు విసరడం ఖాయం. ఓటర్లు వాటి వలలో చిక్కు కోవడం మానుకోవాలి. ఇంకా త్రిబుల్ ఆర్ రాజీనామా చేయకుండానే ఇలా హల్చల్ జరుగుతోంది. నిజంగా ఉప పోరు షురూ అయితే నరసాపురం రాజకీయం రంజు..రంజుగా ఉండటం ఖాయం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • bjp
  • jagan mohan reddy
  • Jana Sena
  • narsapuram
  • Raghu Rama Raju
  • Telugu Desam
  • ysrcp

Related News

Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

సింగరేణి కార్మికులకు 400 కోట్ల రూపాయల బోనస్ ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బందులో యావత్ ప్రజానీకం, సకల వర్గాలు పాల్గొనాలి ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బిజెపి నాయకులు సమయం తీసుకోండి సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి ఈనెల 23న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం మీడియా

  • Nara Lokesh Google Vizag

    Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • Bihar Elections

    Bihar Elections : బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

  • Mim Asaduddin

    BJP : బిజెపి బలమైన రాజకీయ ప్రత్యర్థి- ఒవైసీ

Latest News

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

  • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

  • Air China Flight : విమానంలో మంటలు

  • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd