HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Super Star Mahesh Babus Fake Voter Id In Andhra Pradesh Election Officers Removed It

Mahesh Babu: హీరో మహేష్‌బాబు ఓటర్ ఐడీ.. తొలగించిన ఏపీ అధికారులు.. ఎందుకు ?

దీంతో గుంటూరు పరిధిలో మహేశ్ బాబు(Mahesh Babu) పేరుతో నమోదైన ఓటరు గుర్తింపు కార్డులో ఉన్న  వివరాలపై లోతుగా ఆరా తీశారు.

  • Author : Pasha Date : 06-02-2025 - 2:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Super Star Mahesh Babu Fake Voter Id Andhra Pradesh Election Officers

Mahesh Babu: సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  ఓటు నమోదైంది. ఈ పేరుతో నమోదైన  ఓటులో హీరో మహేష్ బాబు ఫొటో కూడా ఉంది. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఓటరు జాబితాలో దీన్ని గుర్తించిన ఎన్నికల అధికారులు అవాక్కయ్యారు. హీరో మహేశ్ బాబుకు వాస్తవానికి హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌‌లో ఇల్లు ఉంది. ఆయన ఓటు హక్కు కూడా హైదరాబాద్‌లోనే ఉంది. అలాంటిది గుంటూరులో కూడా మహేశ్ బాబుకు ఓటు ఉండటం ఏమిటి అనే ప్రశ్న ఎన్నికల అధికారులకు ఎదురైంది. దీంతో గుంటూరు పరిధిలో మహేశ్ బాబు(Mahesh Babu) పేరుతో నమోదైన ఓటరు గుర్తింపు కార్డులో ఉన్న  వివరాలపై లోతుగా ఆరా తీశారు.

Also Read :Defection MLAs : సీఎల్పీ భేటీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరం.. ఎందుకు ?

ఫొటో, పుట్టినతేదీ, తండ్రిపేరు కరెక్టే.. మిగితావన్నీ అలా

గుంటూరు నగరానికి సంబంధించిన డోర్ నెంబర్ 31-22-1639తో ఆ ఓటర్ ఐడీ ఉంది.  మహేశ్ బాబు విద్యార్హత బీకాం అని అందులో ప్రస్తావించారు. ఆయన పుట్టిన తేదీ 1975 ఆగస్టు 9 అని పొందుపరిచారు. మహేశ్ బాబు నిజమైన పుట్టిన తేదీ కూడా అదే. తండ్రి పేరు ఘట్టమనేని కృష్ణ అని కరెక్టుగానే రాశారు.  బూత్ నంబర్ 214 వరుస సంఖ్య 1179 అని రాశారు. ఈవివరాలన్నీ తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు.. అది ఫేక్ సమాచారంతో తయారు చేసిన ఓటరు ఐడీ అని తేల్చారు. దీంతో వెంటనే దాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితా నుంచి తొలగించారు.

Also Read :Maha Kumbh: సనాతన ధర్మంలోకి 200 మంది ఫారినర్లు.. మహాకుంభ మేళాలో ఆధ్యాత్మిక శోభ

అధికారుల స్పందన ఇదీ.. 

ఈవివరాలను గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, AERO చల్లా ఓబులేసు మీడియాకు వెల్లడించారు. ‘‘మహేష్ బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదైం ది. ఫారం-7 విచారణ అనంతరం ఓటును తొలగించాం’’ అని ఆయన చెప్పారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 10 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • AP Election Officers
  • Fake Voter ID
  • Graduate MLC polls
  • mahesh babu
  • Mahesh Babu Voter ID
  • super star

Related News

Ambati Rambabu

Ambati Rambabu: అమరావతిపై అంబటి విషం..

Amaravati ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని, ఇది ఎప్పటికీ ముగియని కథ అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి “మావిగన్” (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) MAVIGUN కారిడారే అసలైన మంత్రమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం స

  • Chandrababu Naidu

    Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

  • Vijayasai Reddy about amaravati

    Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

  • Vishnu Kumar Raju

    Political Satire: జగన్ పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

  • Perni Nani Arrest

    Perni Nani: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు నమోదు

Latest News

  • Renu Desai : సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలను ఖండించిన రేణుదేశాయ్

  • Summer Holidays : స్మార్ట్ ఫోన్ మాయాజాలం.. మారుతున్న బాల్యం!

  • Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

  • Vijayawada : ఆర్టీసీ బస్ కండక్టర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ

  • Tihar Jail : తీహార్ జైలుపై కవిత కీలక వ్యాఖ్యలు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd