Rajya Sabha ByPoll: రాజ్యసభ బైపోల్ షెడ్యూల్ రిలీజ్.. రేసులో ఆ ముగ్గురు ?
విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ.. బీజేపీకి(Rajya Sabha ByPoll) క్రమంగా దగ్గరవుతున్నారు.
- By Pasha Published Date - 10:46 AM, Wed - 16 April 25

Rajya Sabha ByPoll: ఆంధ్రప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో ఈడీ కేసులు నమోదు చేసిన వెంటనే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
ఈసీ ప్రకటన ఇదీ..
- ఏపీలోని రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కోసం ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదలవుతుంది.
- ఏప్రిల్ 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
- ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
- నామినేషన్ల ఉపసంహరణకు మే 2 వరకు గడువు ఇచ్చారు.
- మే 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.
- మే 13లోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ రేసులో ఉన్నది ఎవరు ?
విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ.. బీజేపీకి(Rajya Sabha ByPoll) క్రమంగా దగ్గరవుతున్నారు. ఇటీవలే రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ హైదరాబాద్‌కు వచ్చినపుడు, వెళ్లి విజయసాయిరెడ్డి కలిశారు. టీడీపీ, జనసేనలపై గతంలో విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన చూపు ప్రస్తుతం బీజేపీ వైపే ఉందని అంటున్నారు. అందుకే విజయసాయి బీజేపీలోనే చేరాలని భావిస్తున్నారట. వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అక్రమాల వివరాలను విజయసాయిరెడ్డితోనే బయట పెట్టించడం ద్వారా, కూటమి పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అనుకుంటున్నారట. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ సీటును బీజేపీ పొందింది. ఇప్పుడు మరో రాజ్యసభ స్థానాన్ని కూడా బీజేపీ ఆశిస్తోందట. ఒకవేళ విజయసాయి ఇప్పుడు బీజేపీలో చేరినా.. వెంటనే ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీలో చాలా ఏళ్లుగా ఉన్న సీనియర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తారని సమాచారం. బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయని అంటున్నారు.