HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Singapore Government Awards Indian Workers Who Saved Pawan Kalyans Son

Mark Shankar : మార్క్ శంకర్‌ను కాపాడిన భారత కార్మికులకు అవార్డు

అగ్ని ప్రమాద స్థలంలో చిక్కుకున్న మార్క్‌ శంకర్((Mark Shankar) సహా పలువురు స్కూలు పిల్లలను వారు కాపాడి బయటికి తీసుకొచ్చారు.

  • Author : Pasha Date : 16-04-2025 - 9:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyans Son Mark Shankar Singapore Government Awards To Indian Workers

Mark Shankar :  సింగపూర్‌‌లోని సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలో ఉన్న రివర్‌ వ్యాలీ రోడ్‌ స్కూలులో ఏప్రిల్‌ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌  కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు భారతీయ వలస కార్మికులు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు.  అగ్ని ప్రమాద స్థలంలో చిక్కుకున్న మార్క్‌ శంకర్((Mark Shankar) సహా పలువురు స్కూలు పిల్లలను వారు కాపాడి బయటికి తీసుకొచ్చారు. ఆ పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారు.  స్కూలు పిల్లలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఆ భారతీయ కార్మికులను సింగపూర్‌ ప్రభుత్వం సత్కరించింది. వారందరికీ ‘లైఫ్‌ సేవర్‌’ అవార్డును ప్రదానం చేసింది. ఈమేరకు వివరాలతో సింగపూర్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read :Delhi Tremors: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీని తాకిన ప్రకంపనలు

ఘటన ఇలా జరిగింది.. 

ఈ అవార్డును పొందిన భారతీయ కార్మికులు అగ్ని ప్రమాదం జరిగిన తీరు గురించి వివరించారు. ‘‘మేం చూసే సరికి ఆ స్కూలు బిల్డింగుకు భారీగా మంటలు అంటుకున్నాయి. స్కూలులో నుంచి పిల్లల ఆర్తనాదాలు మాకు వినిపించాయి. లోపల ఉన్న పిల్లలంతా వణికిపోతున్నారు. కాపాడండి అంటూ అరుస్తున్నారు. కొందరు స్కూలు పిల్లలైతే మూడో అంతస్తు నుంచి దూకేందుకు ట్రై చేశారు. మేం వాళ్లను చూసి.. దూకొద్దని సైగలు చేశాం. దీంతో వారంతా దూకకుండా అక్కడే ఉండిపోయారు. వేగంగా మేం స్కూలు బిల్డింగ్‌లోకి ప్రవేశించాం. చుట్టూ ఉన్న మంటలను దాటుకొని వెళ్లి.. పిల్లలను కాపాడి బయటికి తీసుకొచ్చాం. ఒక పాపను మాత్రం మేం కాపాడలేకపోయాం. ఆ పసికందును కూడా మేం కాపాడగలిగి ఉంటే బాగుండేది. అప్పటికే ఆ పాప మంటల్లో కాలిపోయింది. ఆమెను రక్షించలేకపోయినందుకు చింతిస్తున్నాం’’ అని సింగపూర్‌లోని సదరు భారతీయ కార్మికులు చెప్పుకొచ్చారు.  ‘‘స్కూలులో జరిగిన ఆ అగ్ని ప్రమాదంలో 15 మంది పిల్లలు సహా మొత్తం 20 మంది గాయపడ్డారు’’ అని వారు వివరించారు.

Also Read :Vijayashanthi : పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయశాంతి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian workers
  • Mark Shankar
  • Pawan Kalyan
  • Pawan Kalyans Son
  • singapore
  • Singapore Government
  • Singapore Govt Awards

Related News

Pawan Praises Modi's Leader

Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

"పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. తీరిక లేని షెడ్యూల్‌లో కూడా తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

  • Og2

    Pawan Kalyan OG 2 : OG 2 కు పవన్ కళ్యాణ్ నిర్మాత ?

Latest News

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd