Prabhas : బాహుబలి కంటే ముందు హిందీలో ప్రభాస్ నటించిన చిత్రం ఇదే..
Prabhas 1st Bollywood Movie : బాహుబలి కంటే ముందే ప్రభాస్ నార్త్ ఆడియన్స్ ను పలకరించాడు. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన యాక్షన్ జాక్సన్(2014) అనే సినిమాలో ఓ పాటలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించారు
- By Sudheer Published Date - 10:42 AM, Wed - 23 October 24

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా సోషల్ మీడియా (Prabhas Birthday Trending) తో పాటు న్యూస్ ఛానల్స్ లలో కూడా ప్రభాస్ పేరు మారుమోగిపోతుంది. అర్ధరాత్రి నుండే బర్త్ డే విషెష్ లతో ట్రెండింగ్ గా మార్చేశారు. అభిమానులే కాదు యావత్ సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెష్ ను అందజేస్తూ వస్తున్నారు.
ప్రభాస్, పూర్తి పేరు ఉప్పలపాటి వేంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత నటుడు ఈయన. 2002లో వచ్చిన “ఈశ్వర్” అనే సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ప్రభాస్, “వర్షం” (2004) సినిమా ద్వారా బ్రేక్ అందుకున్నారు. అప్పటినుండి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. 2015లో విడుదలైన ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి: ది బిగినింగ్” సినిమా ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. “బాహుబలి” సిరీస్ రెండో భాగం “బాహుబలి 2: ది కన్‌క్లూజన్” (2017) భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రెండు చిత్రాలు ప్రభాస్‌ను పాన్-ఇండియా స్టార్‌గా మార్చాయి.
బాహుబలి కంటే ముందే ప్రభాస్ నార్త్ ఆడియన్స్ ను పలకరించాడు. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన యాక్షన్ జాక్సన్(2014) అనే సినిమాలో ఓ పాటలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించారు. ఎనర్జిటిక్ స్టెప్పులేసి అదరగొట్టాడు. కానీ ఈ సినిమా వచ్చిన సమయంలో ప్రభాస్‌కి నార్త్‌లో అంత గుర్తింపు లేదు. అందుకే అప్పుడీ ఈ కేమియో ఎవ్వరి కంట పడలేదు. అయితే సరిగ్గా ఏడాది తర్వాత ‘బాహుబలి’గా వచ్చి అందరినీ ఆకట్టుకుని అక్కడి టాప్ హీరోస్ సరసన చేరిపోయాడు. దీంతో ఆ తర్వాత యాక్షన్ జాక్సన్ చూసిన చాలా మంది ప్రభాస్‌ను గుర్తుపట్టి ఆ క్లిప్పింగ్స్‌ను నెట్టింట తెగ ట్రెండ్ చేశారు.
Read Also : Pulivendula : ఘోర ప్రమాదం.. 30 అడుగుల లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు