Pulivendula
-
#Andhra Pradesh
AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక
అసెంబ్లీ నిబంధనల ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. ఇది సరళమైన నిబంధన దాన్ని విస్మరించలేం అని ఆయన గుర్తు చేశారు.
Published Date - 12:26 PM, Sat - 6 September 25 -
#Andhra Pradesh
Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్ పై లోకేశ్ సెటైర్
సోషల్ మీడియా వేదికగా లోకేశ్ స్పందిస్తూ, "ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు వింటాం గానీ... తన సొంత నియోజకవర్గంలో, తన పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా? ఇదేం కొత్త రీతీ, చూడలేదుగా!" అంటూ జగన్ చర్యలపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. రాజకీయ వర్గాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చలకు దారితీశాయి.
Published Date - 02:21 PM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ పిచ్చికి పరాకాష్ట.. వీఐపీ పాస్ ఉంటేనే దర్శనమిస్తాడట..!
YS Jagan : పులివెందులలో జరిగిన తాజా సందర్భం వైసీపీ శ్రేణులను ఆశ్చర్యానికి లోనుచేసింది. వైసీపీ అధినేత వైస్ జగన్ ను కలిసే అవకాశం సాధారణ పద్ధతులు కంటే భిన్నంగా, ఇప్పుడు పూర్తిగా వీఐపీ పాస్ ఆధారంగా నియంత్రించబడినట్లు తెలుస్తోంది.
Published Date - 11:32 AM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : వైసీపీ పట్ల ప్రజల నమ్మకం నశించదు.. జగన్ విలువలు కలిగిన వ్యక్తి : సజ్జల
జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికల్లో తాము ఎదుర్కొన్న అన్యాయాలపై న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిజమైన విలువలతో నడిచే నాయకుడని, ఆయన ప్రజల భద్రతను మొదటిప్రాధాన్యతగా చూసే వ్యక్తి అని అన్నారు.
Published Date - 03:23 PM, Fri - 15 August 25 -
#Andhra Pradesh
Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
Published Date - 04:08 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
Pulivendula : ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఘటన..30 ఏళ్ల తర్వాత ఓటేశా బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు మెసేజ్..!
ఆ స్లిప్‌లో ఓటింగ్‌లో పాల్గొన్న ఓ గోప్యమైన వ్యక్తి చేతితో రాసిన సందేశం ఉంది. "30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను. చాలా ఆనందంగా ఉంది. ఇన్ని ఏళ్లుగా ఇక్కడ స్వేచ్ఛగా ఓటేయలేకపోయాం" అని ఆ ఓటరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో గతంలో ఏవిధంగా ప్రజలపై ఒత్తిడి ఉండేదో, ఇప్పుడు పరిస్థితి మారిందని తెలిపే ఉదాహరణగా మారింది.
Published Date - 02:38 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
Pulivendula : 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశాం: సీఎం చంద్రబాబు
ఈ విజయం పులివెందుల ప్రాంత రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్‌గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అతి పటిష్ట కంచుకోటగా భావించే పులివెందులలో టీడీపీకి వచ్చిన ఈ అద్భుత ఫలితం, అక్కడి ప్రజల మూడ్ ఎలా మారిందో స్పష్టంగా చూపుతోంది.
Published Date - 02:17 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో సంచలనం..నాలుగు దశాబ్దాల వైఎస్ కంచుకోట పై టీడీపీ జెండా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం రాజకీయంగా అపూర్వ ఘటనగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 11:16 AM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
By-elections : పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ భరిత వాతావరణం
పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్‌ను ఒకే రౌండ్‌లో 10 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్‌తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం మొత్తం 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు సహా దాదాపు 100 మంది అధికారుల బృందం కౌంటింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది.
Published Date - 10:06 AM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : పులివెందులలో అరాచకాలు జరగలేదనే అసహనంలో జగన్ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి సాయం అందించారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంనుంచి ఇప్పటివరకు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరగడం లేదు.
Published Date - 06:02 PM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: వైఎస్ అవినాష్‌రెడ్డి
అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Published Date - 12:37 PM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో ZPTC ఉపఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు
Pulivendula : సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
Published Date - 11:19 AM, Tue - 12 August 25 -
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ప్రజలు ఏమంటున్నారంటే !!
Pulivendula : టీడీపీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుకున్నాయని, అందుకే ఈసారి తప్పకుండా టీడీపీకే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారు
Published Date - 01:27 PM, Mon - 11 August 25 -
#Andhra Pradesh
AP News : “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా?”.. టీడీపీ వినూత్న ప్రచారం..
AP News : పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణం నెలకొంది.
Published Date - 05:03 PM, Sun - 10 August 25 -
#Andhra Pradesh
YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Published Date - 12:43 PM, Thu - 7 August 25