Ram Gopal Varma: మార్ఫింగ్ ఫొటోల కేసు.. వర్మకు హైకోర్టులో ఊరట
రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) శుక్రవారం (ఫిబ్రవరి 7వ తేదీ) పోలీసు విచారణకు హాజరయ్యారు.
- By Pasha Published Date - 12:48 PM, Thu - 6 March 25

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు స్వల్ప ఊరట లభించింది. వివిధ అభియోగాలతో తనపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, 6 వారాల పాటు చర్యలను నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17న నిర్వహిస్తామని వెల్లడించింది.
Also Read :Bombs Dropped : యుద్ధ విమానం తప్పిదం.. జనావాసాలపై 8 బాంబులు
ఏమిటీ కేసు ?
- ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2024 నవంబరు 10న రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
- వర్మ తీసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా అనేది కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉందని ఫిర్యాదుదారులు ఆరోపించారు.
- ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలను మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారని కూడా ఫిర్యాదుదారులు ఆరోపణ చేశారు.
- ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదైంది. దీనిపై విచారణను తదుపరిగా ఏపీ సీఐడీ చేపట్టింది.
- నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా, విచారణకు వర్మ హాజరు కాలేదు.కొద్ది రోజుల పాటు ఆయన అజ్ఞాతంలోనే ఉండిపోయారు.
- ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా.. హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూనే, పోలీసుల విచారణకు సహకరించాలని వర్మను ఏపీ హైకోర్టు ఆదేశించింది.
- అయితే రాంగోపాల్ వర్మ పలుసార్లు పోలీసుల విచారణకు వరుసపెట్టి హాజరుకాలేదు.
- తాజాగా ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని సీఐ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆర్జీవీ ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని బదులిచ్చారు.
- రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) శుక్రవారం (ఫిబ్రవరి 7వ తేదీ) పోలీసు విచారణకు హాజరయ్యారు.
- ఈక్రమంలోనే తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో వర్మ పిటిషన్ వేశారు.