HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rajnath Singh Said That Amaravati Is The Capital Of Ap

AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్​సింగ్

  • Author : Sudheer Date : 27-02-2024 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajnadh Ap
Rajnadh Ap

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్​సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్‌నాథ్‌ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ..త్వరలో భారతదేశం ప్రపంచంలోనే గొప్ప ఆర్ధిక వ్యవస్థగా ఎదగబోతోందని తెలిపారు. రక్షణ వ్యవహారాల్లో మనం సాధిస్తోన్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీలోను బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, ఇది తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని పేర్కొన్నారు. బీజేపీ మూల సిద్ధాంతం రాజకీయం ఒక్కటే కాదని ప్రజలకు సేవ కూడా తమ లక్ష్యమని తెలిపారు. ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు రాజ్ నాధ్ వద్ద ప్రస్తావించగా.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన సమాచారం ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ కూడా అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణనలోకి తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్‌భవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకంగా ప్రచారం చేసుకుంటోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మొత్తం నిధులు వారే ఇస్తున్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ రాజ్‌నాథ్‌సింగ్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇది సరైందని కాదని రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. తాము ఈ విషయంలో ఆందోళన చేస్తున్నామని, కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లామని – ఫలితంగా కేంద్ర ప్రభుత్వ లోగోను ఇటీవలే ఆరోగ్యశ్రీ కార్డులపై వేస్తున్నారని పురందేశ్వరి తెలిపారు. నిర్భయ కింద కేంద్ర ప్రభుత్వం 138 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయించినా మహిళలు, బాలికల రక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం తగిన మౌలిక వసతులు కల్పించలేదని రాజ్‌నాథ్‌సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Read Also : Koduru Kamalakar Reddy : వైసీపీకి మరో షాక్..కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • ap
  • ap capital
  • bjp
  • Rajnath singh

Related News

The Largest International Airport in Amaravati

Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

ఏపీ రాజధాని అమరావతిలో 4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్లాన్ చేశారు. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూసమీకరణా, సేకరణా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్

  • Deputy CM to arrive in AP today

    Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

  • Minister Narayana inspected the MLA and MLC buildings in Amaravati.

    AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

  • IT Minister Nara Lokesh Receives Grand Welcome At Singapore

    Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

Latest News

  • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

  • Lord Shani: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? ఎలాంటి పనులు చేయాలి? పూజా విధానం ఇదే!

  • AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

  • Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్

  • Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd