Koduru Kamalakar Reddy : వైసీపీకి మరో షాక్..కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా
- By Sudheer Published Date - 08:11 PM, Tue - 27 February 24

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా లో మాకు తిరుగులేదని , 175 కి 175 స్థానాలు సాదించబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ..నేతల్లో మాత్రం ఆ నమ్మకం లేక..వరుసపెట్టి పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేయగా..తాజాగా నెల్లూరు రూరల్‌లో కీలక నేత కోడూరు కమలాకర్ రెడ్డి (Koduru Kamalakar Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అవమానించి, పార్టీ నుంచి వెళ్లగొట్టిన తీరు తనని బాధించిందని కమలాకర్ చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. మరోరెండు రోజుల్లో వైసీపీ ముఖ్యనేత టీడీపీలోకి చేరబోతున్నారనితెలిపారు. నెల్లూరు రూరల్‌లో టీడీపీకి అతిపెద్ద మెజార్టీ రాబోతోందని పేర్కొన్నారు. జిల్లా రాజకీయాల్లో 30 ఏళ్లుగా కోడూరు కమలాకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మార్చి 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) సమక్షంలో వీపీఆర్‌తో కలిసి కమలాకర్ తమ టీడీపీ లో చేరుతారని స్పష్టం చేశారు. రూరల్‌లో పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నాయని.. వచ్చే నెలలోనూ ఇంకా పెద్దఎత్తున చేరికలు ఉండబోతున్నాయని జోస్యం చెప్పారు.
అలాగే స్పీకర్ అనర్హత వేటు వేయడం ఫై కోటం మాట్లాడుతూ..అనర్హత వేటు వల్ల మాకు ఎలాంటి నష్టమూ లేదన్నారు. అసలు ఈ ఎపిసోడ్‌లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. ఏడాది క్రితమే వైసీపీ మమ్మల్ని సస్పెండ్ చేసింది.. సస్పెండ్ చేసిన తర్వాత మాపై అనర్హత వేటు వేసే నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణ సరికాదని హితవుపలికారు.
Read Also : CM Revanth Reddy : కేటీఆర్ కు సీఎం రేవంత్ సవాల్..