HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rajahmundry Andhra Paper Mill Lockout

Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..

  • Author : Vamsi Chowdary Korata Date : 02-05-2026 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Paper Mill Lokout
Andhra Paper Mill Lokout

Andhra Paper Mill Lokout  తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్‌ మిల్లు యూనిట్‌లో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావద్దంటూ యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. అయితే, ఈ రోజు కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులతో యాజమాన్యం చర్చలు జరపనుంది.

తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్ ప్రకటించింది. పేపర్ మిల్లులో పనిచేసే పర్మినెంట్‌ ఉద్యోగులు ఎవరూ విధులకు రావొద్దని యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. ఉన్నట్టుండి పేపర్ మిల్లుకు లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు, వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది.

గత మూడేళ్లుగా ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం కొత్త అగ్రిమెంట్లు చేయకుండా మోసం చేస్తోందని, యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇంతలో పర్మినెంట్ ఉద్యోగులను కూడా విధులకు రావొద్దంటూ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు దగ్గర నోటీసు కూడా అంటించింది. కార్మికుల సమ్మెకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంఘీభావం తెలిపారు. ఈ రోజు యాజమాన్యంతో చర్చిద్దామని కార్మికులకు ఆయన హామీ ఇచ్చారు. కొత్త అగ్రిమెంట్లు సహా మిగిలిన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చించనున్నారు.

కార్మికశాఖ అధికారులు కూడా ఇవాళ మిల్లు దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక దినోత్సవం రోజు కార్మికుల్ని అణిచివేసేందుకు పేపర్ మిల్లు పరిశ్రమ లాకౌట్ ప్రకటించడం దారుణమని సీఐటీయూ నేతలు అన్నారు. 1964లో ఆంధ్రా పేపర్ మిల్లును స్థాపించారు. ప్రధానంగా రైటింగ్ పేపర్, ప్రింటింగ్ పేపర్, కాపీయర్ పేపర్లు తయారవుతాయి. ఈ యూనిట్‌ను రూ.3,400 కోట్ల పెట్టుబడితో ఆధునీకరించాలని నిర్ణయించారు. కానీ ఇంతలోనే లాకౌట్ ప్రకటించడం సంచలనంగా మారింది.

ఇటీవల కాకినాడలో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్లాంట్ కూడా మూతపడింది. భారీగా నష్టాలు రావడంతో మూసివేయాలని కంపెనీ బోర్డు మార్చి 31న నిర్ణయం తీసుకుంది. వెంటనే ప్లాంట్‌ను మూసివేశారు. దాదాపు రూ.1406 కోట్లు నష్టాలు పేరుకుపోవడంతో, ప్లాంట్ నిర్వహణ లాభదాయకం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు సమాచారం ఇచ్చారు. అలాగే ప్లాంట్ మూసివేస్తున్నట్లు కలెక్టర్, పరిశ్రమలు, ఇతర శాఖలకు సమాచారం ఇచ్చారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Paper Mill
  • Andhrapradesh
  • Kadiam
  • Lockout
  • rajahmundry

Related News

Electricity Charges HIKE IN AP

Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరదించారు. ఎన్నికల వరకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. పమిడిముక్కల వేదికగా జరిగిన

  • Nara Lokesh

    Nara Lokesh : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – అక్షర సారథి లోకేష్!

  • Lv Prasad Eye Hospital

    LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !

  • Ap 10th Exam Results

    AP 10th Results : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల..అమ్మాయిలదే పైచేయి !!

  • Check For Drink & Driving

    Drink & Driving : డ్రింక్ & డ్రైవింగ్ ప్రమాదాలను అరికట్టేందుకు రాజమండ్రిలో డియాజియో ఇండియా వినూత్న కార్యక్రమం!

Latest News

  • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

  • T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.

  • Rashmi Gautam: వైసీపీ లీడర్‌పై యాంకర్ రష్మీ సీరియస్..!! నేను ఎవరికీ భయపడను.

  • Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

  • Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd