HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Property Tax Payments Are Now Online In 13326 Gram Panchayats Of Andhra Pradesh

Digital Panchayats : ఏపీలో ‘స్వర్ణ పంచాయతీ’.. 13,326 పంచాయతీల్లో డిజిటల్ సేవలు

తొలిదశలో  గ్రామ పంచాయతీల్లో ముఖ్యమైన సేవలు(Digital Panchayats) మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.

  • Author : Pasha Date : 27-11-2024 - 11:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Digital Gram Panchayats Property Tax Payments Online Andhra Pradesh

Digital Panchayats : ఆంధ్రప్రదేశ్‌లోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను పేమెంట్స్ ఆన్‌లైన్ అయ్యాయి. రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న దాదాపు 88 లక్షల ఇళ్లు, దుకాణాలు, భవనాల సమగ్ర సమాచారాన్ని ‘స్వర్ణ పంచాయతీ’  పేరుతో ప్రత్యేక పోర్టల్‌లోకి తీసుకొచ్చారు. జనవరి నుంచి రాష్ట్ర ప్రజలు తమ ఇళ్లు, భవనాల అసెస్‌మెంట్‌ నంబరును ప్రత్యేక పోర్టల్‌లో ఎంటర్ చేసి.. ఆస్తి పన్ను బకాయిల సమాచారాన్ని చూసుకొని ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయొచ్చు. ఆస్తిపన్ను వసూళ్ల కోసం 5వేల పెద్ద పంచాయతీల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. డెబిట్, క్రెడిట్‌ కార్డులతోనూ బకాయిలు చెల్లించొచ్చు. కొన్ని గ్రామపంచాయతీల్లో క్యూఆర్‌ కోడ్‌‌తో పన్ను బకాయిలు కట్టొచ్చు. ప్రజల నుంచి వసూలుచేసే మొత్తాలు నేరుగా గ్రామ పంచాయతీల పీడీ ఖాతాల్లో జమ అవుతాయి. వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, జనన, మరణ ధ్రువీకరణపత్రాల సేవలను కూడా ఆన్‌లైన్‌లోనే పొందొచ్చు.

Also Read :Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు కారుపై రాళ్ల దాడి

జనవరి నుంచి ‘స్వర్ణ పంచాయతీ’  పోర్టల్ ప్రారంభం అవుతుంది. అయితే తొలిదశలో  గ్రామ పంచాయతీల్లో ముఖ్యమైన సేవలు(Digital Panchayats) మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఈ సేవల జాబితాలో ఆస్తి విలువ ధ్రువీకరణ పత్రాలు, వ్యాపార లైసెన్సులు, జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు నిరభ్యంతర ధ్రువీకరణపత్రాలు, భవన నిర్మాణ అనుమతులు ఉంటాయి. తదుపరిగా విడతలవారీగా మొత్తం 80 రకాల సేవలను స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో అందుబాటులో తీసుకొస్తారు.  వాస్తవానికి గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ పోర్టల్‌ను ప్రారంభించాలని టీడీపీ యోచించింది. దాని నిర్వహణ బాధ్యతలను అప్పట్లో నేషనల్‌ ఇన్ఫర్మాటిక్ సెంటర్‌(ఎన్‌ఐసీ)కు అప్పగించారు. అయితే వైఎస్సార్ సీపీ సర్కారు ఏర్పడిన తర్వాత ఎన్‌ఐసీకి నిధుల కేటాయింపును ఆపేశారు. దీంతో ఈ పోర్టల్‌ నిర్వహణ ఆగిపోయింది.ఇప్పుడు మళ్లీ టీడీపీ సర్కారు రావడంతో స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ నిర్వహణను రాష్ట్ర ఆర్థిక నిర్వహణ, సేవల సంస్థకు అప్పగించారు.

Also Read :Jay Bhattacharya : అమెరికా ఎన్‌ఐహెచ్‌ డైరెక్టర్‌గా జై భట్టాచార్య.. ట్రంప్ ప్రకటన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Gram Panchayats
  • Digital Panchayats
  • Gram Panchayats
  • Property Tax Payments

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

Latest News

  • Wedding Season: మళ్లీ మొదలైన శుభ ఘడియలు.. పెళ్లి బాజాలు కు రెడీ

  • FIFA WC 2026: 200వ గోల్‌ తో చరిత్ర సృష్టించిన మెస్సీ

  • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd