PM Modi AP Tour: నేడు తిరుమలకు ప్రధాని, సీఎం జగన్ తిరుపతి టూర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలియుగ వైకుంఠం తిరుమలలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 26-11-2023 - 10:12 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi AP Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలియుగ వైకుంఠం తిరుమలలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం రాష్ట్రానికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు జగన్ తిరుపతి వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ కొండవీటివాగు సందర్శనకు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తిరుపతికి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు .అయితే ముఖ్యమంత్రి, ప్రధాని ఆలయ పర్యటనకు ముందు తిరుపతి జిల్లా అధికారులు రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమల కొండపైకి చేరుకునే మార్గం పొడవునా భద్రత ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాని ప్రయాణించే మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. ప్రధాని మోదీ రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం వేంకటేశ్వరుడి ఆశీస్సులు పొందేందుకు మోదీ ఆలయాన్ని సందర్శిస్తారు.ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీ అభ్యర్థుల కోసం ప్రధాని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మోడీ తిరుమలను దర్శించుకుంటారు.