Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై పోలీస్ కేసు నమోదు.. ఎక్కడంటే..?
తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Author : Gopichand
Date : 12-11-2022 - 3:34 IST
Published By : Hashtagu Telugu Desk
తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇప్పటం వెళ్లే సమయంలో ఆయన కారుపై కూర్చొని వెళ్లగా, డ్రైవర్ రాష్‌గా డ్రైవింగ్ చేశాడని పలు వీడియోలతో.. తెనాలి మారిస్‌పేటకు చెందిన శివ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు ఐపీసీ 336, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ కార్యక్రమం కారణంగా నివాసాలు కోల్పోయిన స్థానికులకు అండగా ఉండటం కోసం పవన్ ఇటీవల ఇప్పటం వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇప్పటం నుంచి వస్తున్న సమయంలో ఓ హైవేపై పవన్ తన కారు పైభాగంలో ప్రయాణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇదే విషయమై పవన్ పై పోలీస్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పవన్ పై కేసు నమోదైంది. పవన్‌పై ఐపీసీ 336, 177 ఎంవీ యాక్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు. పవన్ డ్రైవర్‌పై కూడా కేసు నమోదైంది.