HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan To Begin 11 Day Penance Today Amid Tirupati Laddoo Controversy

Pawan Kalyan: ఏడుకొండలవాడా..! క్షమించు.. ప‌వ‌న్‌11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష

లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాను.

  • Author : Gopi Date : 22-09-2024 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: “ఏడుకొండలవాడా! క్షమించు..11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా” అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన పోస్ట్ చేశారు. “లడ్డూ ప్రసాదం జంతు అవశేషాలతో మాలిన్యమైంది. లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాను.” అని తన ఎక్స్ ఖాతాలో పవన్ పోస్ట్ చేశారు.

Also Read: Liver Health Tips : తెల్లవారుజామున చేసే ఈ పొరపాట్లు కాలేయాన్ని డిస్టర్బ్ చేస్తాయి.!

ఏడుకొండలవాడా..! క్షమించు
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం…

— Pawan Kalyan (@PawanKalyan) September 21, 2024

ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ఏడుకొండలవాడా..! క్షమించు. 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష. అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.

లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా… నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను.

భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • CM Chandrababu
  • Janasena
  • janasenani
  • Pawan Kalyan
  • tdp
  • Tirupati Laddu
  • ttd
  • ysrcp

Related News

Tdp

TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి నెల ముందే మొదలైంది. వచ్చే నెలలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో తమ పేరు పరిశీలించాలంటూ వినతులు మొదలయ్యాయి. టీడీపీలో భారీగా ఆశావహులు ఉన్నారు. మిత్రపక్షాలకు ఎన్ని ఇస్తారన్నదానిపైనే టీడీపీ నేతలకు కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నుంచి రేసులో ఏకంగా 8 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజ

    Latest News

    • Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

    • AP Government: ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుర్తింపు, రేషన్‌ కార్డులు: మంత్రి బాల వీరాంజనేయస్వామి

    • Bandi Bagheerath: బండి భగీరథ్.. స్పందించిన బాధితురాలి తల్లి సంచలన లేఖ

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

    Trending News

      • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd