HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Reaction On Operation Sindoor

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ పై పవన్ ఫస్ట్ రియాక్షన్

Operation Sindoor : ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై దేశం కఠినంగా స్పందించాలన్నది తన అభిప్రాయం అని, దేశ భద్రతకు వ్యతిరేకంగా, పాక్ మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు

  • Author : Sudheer Date : 07-05-2025 - 1:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan Operation Sind
Pawan Kalyan Operation Sind

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) తన మొదటి స్పందన తెలిపారు. శాంతి, అహింస నినాదాలతో ముందుకెళ్తున్న దేశాన్ని కొంతకాలంగా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. పండిట్లను, హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇటీవలి ఉగ్రవాద దాడిలో ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడాన్ని ఆయన గుండెను కలిచేసిందని పేర్కొన్నారు. భారత్ ఇక మౌనంగా ఉండకూడదని, సైన్యం చేపట్టిన చర్యలు సరికొత్త యుద్ధానికి నాంది కావాలన్నారు.

Crack Heels: మడమల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై దేశం కఠినంగా స్పందించాలన్నది తన అభిప్రాయం అని, దేశ భద్రతకు వ్యతిరేకంగా, పాక్ మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దేశం మొత్తం మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

చివరిగా మతం ఆధారంగా వివక్షలు ఉండకూడదని, దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న సమస్యలపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమ వలసదారుల ప్రవేశం వల్ల దేశ భద్రతకే కాదు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలపైనా ప్రభావం పడుతోందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం ఉగ్ర స్థావరాలను నాశనం చేయడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ధ్వంసమయ్యాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • India - Pak War
  • Operation Sindoor
  • Pawan Kalyan
  • Pawan Kalyan First Reaction

Related News

Pawan Kalyan Ustad Bhagat Singh Working stills released from Movie Unit Shootings not stopped with Chandrababu Arrest

Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

రాబోయే రోజుల్లో ఏవైనా సెలవు దినాలు కలిసి వస్తే తప్ప, ఈ 100 కోట్ల గ్రాస్ టార్గెట్ రీచ్ అవ్వడం సవాలుతో కూడుకున్న పని. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరియు సినిమాల మధ్య ఉన్న గ్యాప్ వల్ల అభిమానులు

  • Pawan Prakash Raj

    ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

Latest News

  • Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర..కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్ !!

  • Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

  • Redmi Note 15 : రెడ్‌మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ లాంచ్

  • Divorce Celebration: కూతురి విడాకులకు ఊరేగింపు వేడుక..

  • New House : ఇల్లు కొనే ప్లాన్ ఉందా? మహిళా కొనుగోలుదారుల కోసం అమూల్యమైన సలహాలు

Trending News

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd