Crack Heels: మడమల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
పాదాల మడమల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు నొప్పి భరించలేకపోతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:00 PM, Wed - 7 May 25

మామూలుగా మడమల పగుళ్లు రావడం అన్నది సహజం. కొన్ని కొన్ని సార్లు విపరీతంగా పగిలి నొప్పి కూడా వస్తూ ఉంటుంది. మడమలు బాగా పొడి బారడం వల్ల ఈ పగుళ్ల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లైతే ఈ పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుందట. ఎక్కువ గంటలు నిలబడటం, ఊబకాయం, కొన్ని అనారోగ్య సమస్యలు, లేదా పాదాల సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పాదాలు పగుళుతాయట. మీ పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పగుళ్లు తగ్గడానికి వారానికి కనీసం రెండుసార్లు అయినా ఎక్స్ఫోలియేట్ చేయాలని, ఇందుకోసం గోరువెచ్చని, సబ్బు నీటి టబ్ తీసుకొని మీ పాదాలను సుమారుగా 20 నిమిషాలు లేదా చర్మం మృదువుగా మారే వరకు దానిలో ముంచాలని చెబుతున్నారు.
అలాగే మడమలలోని చనిపోయిన చర్మ కణాలను స్క్రబ్ చేయడానికి ఫుట్ స్క్రబ్బర్ లేదా ప్యూమిస్ స్టోన్ ఉపయోగించంచడం మంచిదని చెబుతున్నారు. పాదాలు ఎక్కువగా పొడిబారడం వల్ల ఈ పాదాల పగుల సమస్యలు వస్తాయట. కాబట్టి మీ పాదాలను తేమగా ఉంచడానికి ప్రయత్నించడం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల మీ చర్మం కూడా మృదువుగా మారుతుందట. పగుళ్లు ఏర్పడవు అని చెబుతున్నారు. చేతులతో నెమ్మదిగా 2 నుంచి 3 నిమిషాలు మసాజ్ చేయాలట.
తర్వాత మాయిశ్చరైజర్ శోషణను పెంచడానికి శుభ్రమైన మృదువైన కాటన్ సాక్స్ ను వేసుకోవాలని చెబుతున్నారు. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయట. పాదాల పగుళ్లు తగ్గాలంటే రాత్రిపూట పగిలిన పాదాలకు కొబ్బరి నూనెను అప్లై చేయడం మంచిదని చెబుతున్నారు. తర్వాత కాటన్ సాక్స్ ను వేసుకుని పడుకోవాలి. ఉదయం వరకు సాక్స్ లను తీయకూడదట. ఇలా చేయడం వల్ల ఆ పాదాల పగుల సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే పెట్రోలియం జెల్లీ కూడా పాదాల పగుళ్లను తగ్గించడానికి బాగా సహాయపడుతుందట. ఇది మీ పాదాలను తేమగా ఉంచుతుందని, అలాగే పాదాల పగుళ్లను నయం చేయడానికి బాగా సహాయపడుతుందని, ఇందుకోసం పెట్రోలియం జెల్లీకి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పగుళ్లకు పెట్టాలి అని చెబుతున్నారు.