AP: ఎందుకీ గర్జనలు ? జగన్ సర్కార్ పై పవన్ ఆగ్రహం..!!
వైసీపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
- Author : hashtagu
Date : 10-10-2022 - 11:49 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వికేంద్రీకరణ వర్సెస్ అభివ్రుద్ధి అంటూ పలు అంశాలను ప్రస్తావించిన పవన్ కల్యాణ్…వికేంద్రీకరణకు మద్దతు పేరుతో ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలు…ఈనెల 15న విశాఖ గర్జన పేరుతో తలపెట్టిన ర్యాలీని ఉద్దేశించి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ కు తనదైన రీతిలో కౌంటర్లు ఇచ్చారు. ఎందుకీ గర్జన..అంటూ వరుస ట్వీట్స్ చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయడానికేనా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి ఇప్పుడు ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్ .
దేనికి గర్జనలు?
‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?
— Pawan Kalyan (@PawanKalyan) October 10, 2022
దేనికి గర్జనలు?
151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?
— Pawan Kalyan (@PawanKalyan) October 10, 2022
దేనికి గర్జనలు?
ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా?
— Pawan Kalyan (@PawanKalyan) October 10, 2022
దేనికి గర్జనలు?
కౌలు రైతులకు మొండి చేయి చూపించినందుకా? వ్యవసాయ రంగాన్ని వదిలేసి, సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నందుకా?
— Pawan Kalyan (@PawanKalyan) October 10, 2022
దేనికి గర్జనలు?
విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?
— Pawan Kalyan (@PawanKalyan) October 9, 2022
దేనికి గర్జనలు?
కక్ష సాధింపు రాజకీయాలతో తప్పుడు కేసులుపెట్టిస్తున్నందుకా? పోలీసు వ్యవస్థ చేతులు కట్టేసినందుకా?
— Pawan Kalyan (@PawanKalyan) October 10, 2022