Pawan Kalyan : విపత్తు సమయంలో చిల్లర రాజకీయాలు : పవన్ కల్యాణ్
రాష్ట్రంలో విపత్తు సమయంలో వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చుని చిల్లర రాజకీయం చేస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వరద బాధిత ప్రాంతాల్లో తనతో పాటు పర్యటించాలని వైసీపీ నాయకులకు సూచించారు.
- By Latha Suma Published Date - 09:11 PM, Wed - 4 September 24
Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో విపత్తు సమయంలో వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చుని చిల్లర రాజకీయం చేస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వరద బాధిత ప్రాంతాల్లో తనతో పాటు పర్యటించాలని వైసీపీ నాయకులకు సూచించారు. బడమేరులో తొంబై శాతం అక్రమణలే విజయవాడకు శాపంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వయసులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్రాక్టర్లు, జేసీబీలల్లో ఎక్కి వరద ప్రాంతాల్లో సంచరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్కరు ఆయన అభినందించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతాలకు బుల్డోజర్ ఎక్కి మరీ చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితులకు సహాయం అందుతోంది. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం వైసిపి మానుకోవాలి.పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం #APGovtWithFloodVictims #PawanaKalyan #cmchandrababu #HashtagU pic.twitter.com/LpxnFoROl6
— Hashtag U (@HashtaguIn) September 4, 2024
తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై డీసీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వరద ప్రాంతాలకు వెలితే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు చెప్పారని, అందుకే తాను ఆ ప్రాంతాలకు వెళ్లలేదని డీసీఎం పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. అందుకే తాను ప్రాంతాలకు వెళ్లలేదని పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు పర్యటించి ఆ తర్వాత తనపై విమర్శలు చేయాలని డీసీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలంటే మిమ్మల్ని తన కాన్వాయ్ లో స్వయంగా తానే పిలుచుకొని వెలుతానని, ఆ తర్వాత ఆ ప్రాంతాలు పరిశీలించింది తనకు సలహాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా వరదల కారణంగా ఎక్కువగా దెబ్బతిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 24 ఎస్ టీఆర్ఎఫ్ బృందాలు, 26 ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రాంతాల్లోసహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని డీసీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
నేవీ నుండి రెండు హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన నాలుగు హెలికాప్టర్ల ద్వారా వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం అందిస్తున్నామని అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పాల్గొంటున్నారని ,175 బృందాలు విజయవాడ అర్బన్ లోనే పనిచేస్తున్నాయని, వరద ప్రభావం లేని జిల్లాల నుంచి పారిశుద్ధ కార్మికులు వచ్చి వరద సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు మొదట ప్రజలకు సహాయం చేసి మా ప్రభుత్వం పైన నిందలు వేస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులకు పవన్ కల్యాణ్ సలహా ఇచ్చారు.
Read Also: EPS Pensioners: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షనర్లకు గుడ్ న్యూస్..!
Related News
YS Sharmila : కేంద్రం నుంచి సాయం తెస్తారా?..ఎన్డీయే నుంచి తప్పుకుంటారా?: షర్మిల
YS Sharmila questioned CM Chandrababu : విజయవాడ వరద బాధితులకు కేంద్రం నుంచి సాయం తెస్తారా లేక ఎన్డీయే నుంచి తప్పుకుంటారా అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను ఈరోజు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు.