Andhra Pradesh
-
Crimes against Women: ఏపీలో మహిళలపై పెరిగిన నేరాలు..!
ఏపీలో 2021 వ సంవత్సరంలో మహిళలపై నేరాలు పెరిగాయి. ఈ ఏడాదికి సంబంధించి వార్షిక నేర సమీక్షా సమావేశంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు.
Date : 30-12-2021 - 11:14 IST -
Omicron in AP:ఏపీలో ఒక్క రోజే 10 ఒమిక్రాన్ కేసులు.. ఆందోళనలో ప్రజలు
ఏపీలో ఒమిక్రాన్ కేసుల పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం ఒక్క రోజే పది ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు
Date : 29-12-2021 - 8:42 IST -
Kidambi Srikanth:భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు ఏపీ సీఎం జగన్ భారీ నజరాన.. !
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఘనంగా సత్కరించారు.
Date : 29-12-2021 - 8:26 IST -
Dr Ramesh Babu: డాక్టర్ పోతినేని రమేష్ బాబుకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నుండి కార్డియాలజీలో ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కె శరణ్ అవార్డును అందుకున్నారు.
Date : 29-12-2021 - 4:57 IST -
Chiranjeevi : టాలీవుడ్ `ఆచార్య` మౌనరాగం!
ఇప్పటి వరకు రెండుసార్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యాడు. మూడోసారి కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ సర్కార్ తరహాలో టిక్కెట్ల ధరలను పెంచాలని కోరాలని భావిస్తున్నాడు.
Date : 29-12-2021 - 3:05 IST -
Spirited promise: నవ్విపోదురుగాక.. మాకేంటి!
జాతీయ పార్టీలకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉంటుంది. కానీ, బీజేపీ రాష్ట్రానికో పాలసీని ప్రకటిస్తోంది. తాజాగా ఏపీలో చీప్ లిక్కర్ పాలసీని వినిపిస్తోంది. కేవలం 75 రూపాయలకు చీప్ లిక్కర్ అందిస్తామని ఏపీ బీజేపీ ప్రకటించడం రాజకీయాల దిగజారుడుకు పరాకాష్ట.
Date : 29-12-2021 - 2:32 IST -
Vangaveeti Radha : ‘రెక్కీ’ వెనుక పారిశ్రామికవేత్త?
వంగవీటి రాధా `రెక్కీ` వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆలస్యంగా స్పందించాడు. ఏపీలోని లా అండ్ ఆర్డర్ సమస్యకు ఈ అంశాన్ని ముడివేశాడు. ఆ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాయడం సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతోంది.
Date : 29-12-2021 - 12:42 IST -
Andhra Pradesh: రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- చంద్రబాబు
వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా టీడిపి నేత వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు గుండా
Date : 29-12-2021 - 10:55 IST -
Bezawada Politics : దేవినేని Vs వంగవీటి.. మళ్లీ తెరపైకి పాతకక్షలు.. ?
బెజవాడ రాజకీయాల్లో టీడీపీ యువనేత వంగవీటి రాధా కామెంట్స్ ఇప్పుడు వేడిపుట్టిస్తున్నాయి. ఆయన తండ్రి దివంగత నేత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధా సంచనల కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని మంత్రి కొడాలిని నాని సాక్షిగా కామెంట్స్ చేశారు
Date : 29-12-2021 - 10:29 IST -
AP Jails:ఏపీలో పెరిగిన జైలు మరణాలు.. !
ఏపీలో జైలు మరణాలు 84 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సోమవారం విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా (పిఎస్‌ఐ) నివేదిక ప్రకారం 2020లో ఇలాంటి సంఘటనలు 46 నమోదయ్యాయి. 2019లో 25 జరిగాయి.
Date : 29-12-2021 - 10:01 IST -
AP BJP: ఓటు కు లిక్కర్..
ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు చేసిన ప్రకటన విదాస్పదంగా ఉంది. అధికారంలోకి బీజేపీ వస్తే చిప్ లిక్కర్ కేవలం 75 రూపాయలకు ఇస్తామని హామీ ఇచ్చాడు.
Date : 28-12-2021 - 10:59 IST -
Tirumala : ఆ పదిరోజుల పాటూ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం.. !
జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.
Date : 28-12-2021 - 5:34 IST -
Vangaveeti Radha : రెక్కీ’ రాధా మరో కోణం.!
స్వర్గీయ వంగవీటి రంగా చరిష్మా విజయవాడ మీద ప్రత్యేక మార్క్ ను వేసింది. ఆ మార్క్ రంగా హత్య తరువాత కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. కాలక్రమంలో కాపు సామాజికవర్గానికి రోల్ మోడల్ గా వంగవీటి ఫ్యామిలీ నిలిచింది. బలమైన సామాజిక వర్గం నేపథ్యం ఉన్నప్పటికీ సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా రాణించడంలో మాత్రం రంగా వారసుడు రాధా తడబడుతున్నాడు
Date : 28-12-2021 - 4:55 IST -
బాబు, జగన్ కౌగిలిలో ‘ప్రజాగ్రహసభ’
ఏపీ బీజేపీ విజయవాడ కేంద్రంగా ప్రజాగ్రహసభను పెట్టింది. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పెట్టిన సభకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ తో సహా ఏపీ బీజేపీ సీనియర్లు హాజరయ్యారు. ఆ సభకు ఒక రోజు ముందు నుంచే బీజేపీపైన టీడీపీ, వైసీపీ పోటాపోటీగా దాడికి దిగడం గమనార్హం.
Date : 28-12-2021 - 3:30 IST -
Liquor Caught : పాల వ్యానులో 10వేల మద్యం సీసాలు
ఏపీలో ప్రతిరోజు అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు అవుతున్నాయి.ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి ఏపీలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు.అక్రమ మద్యం రవాణాని అరికట్టేందుకు ఏపీ బోర్డర్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా మాత్రం నియంత్రణ జరగడం లేదు.
Date : 28-12-2021 - 2:26 IST -
Delhi Confidential : జగన్ కు ‘సాయి’ పోటు!?
ఒక ఫోటో వంద ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటారు ఛాయచిత్రకారులు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన ఫోటో జగన్ సర్కార్ మనుగడపై అనుమానాలకు కలిగిస్తోంది. ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి ఉన్న ఫోటోలను ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం బయలుదేరింది.
Date : 28-12-2021 - 2:02 IST -
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇళ్లు ముట్టడి
హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో డంపింగ్ యార్డు మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం హిందూపురంకు చేసిందేమీ లేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు.
Date : 28-12-2021 - 1:57 IST -
Andhra Pradesh: సినిమా టికెట్ల ధరలపై కొత్త కమిటీ
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త కమిటీని నియమించనునట్లు అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు ఉంటారు. కమిటీలో హోం, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిన
Date : 28-12-2021 - 12:51 IST -
APSRTC ఆర్టీసీ సంక్రాంతి బాదుడు..
సంక్రాంతి పండగను ఏపీఎస్ ఆర్టీసీ క్యాష్ చేసుకుంటుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. పట్టణాల నుంచి సొంతూళ్లకు చాలామంది వెళ్తుడంటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
Date : 28-12-2021 - 10:57 IST -
ఏపీలో పథకాలు అందని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు.. !
ఏపీలో పథకాలు అందని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగదును పంపిణీ చేయనున్నారు. వివిధ కారణాల చేత ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికి లబ్ధిపొందని వారికి రీ వెరిఫికేషన్ చేసి ఏటా జూన్, డిసెంబర్‌లో సంక్షేమ పథకాలు అందజేస్తామన్న హామీ మేరకు డబ్బులు జమచేస్తున్నామని వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు.
Date : 28-12-2021 - 10:56 IST