Andhra Pradesh
-
AP & TG Election Results : ఎన్నికల్లో ఘోర ఓటమి ఫై వైసీపీ స్పందన
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ & తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే సమయం రానేవచ్చింది
Date : 04-06-2024 - 5:55 IST -
Pawan Kalyan Win : పవన్ కళ్యాణ్ గెలుపు ఫై రేణు దేశాయ్ ట్వీట్
ఆద్య, అకీరాలకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు నుండి ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను
Date : 04-06-2024 - 5:12 IST -
Election Results : తమ్ముడికి..అన్నయ్య మెగా విషెష్
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది
Date : 04-06-2024 - 4:54 IST -
AP Results 2024: జగన్ సన్నిహితుడు కొడాలి నాని భారీ ఓటమి
టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడలి నాని 51 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు.అయితే ఈ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనే ఆయనకు ఎదురు గాలి వీచింది. దీనికి కారణం నాని వ్యవహార శైలి జనాలకు నచ్చకపోవడం.
Date : 04-06-2024 - 4:41 IST -
AP Results 2024: కాబోయే సీఎం చంద్రబాబు ఇంట్లో సంబరాలు
కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు
Date : 04-06-2024 - 3:55 IST -
TDP : మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు
Election Results 2024: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాల లోకేశ్ మంగళగిరిలో విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్ధాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గ
Date : 04-06-2024 - 2:48 IST -
TDP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..?
Election Results 2024: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టే దిశగా కొనసాగుతుంది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 160 కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీ
Date : 04-06-2024 - 1:45 IST -
AP Results 2024: ఖాతా తెరిచిన టీడీపీ
ఎట్టకేలకు టీడీపీ ఖాతాలో తొలి విజయం నమోదైంది. 175 స్థానాలకు గానూ తొలి ఫలిత వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య తొలి విజయం సాధించారు. రాజమండ్రి రురల్ లో పోటీ చేసిన ఆయన 50 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
Date : 04-06-2024 - 11:45 IST -
TDP : టీడీపీ అధినేత నివాసం వద్ద మొదలైన కోలాహలం
Election Results 2024: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం మొదలైంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. చంద్రబాబు ఇంటి వద్దకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో కోలహలం ఏర్పాడింది. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరె
Date : 04-06-2024 - 11:40 IST -
AP Election Results : ఫ్యాన్‌ను బండకేసి బాదిన టీడీపీ నేతలు
వైఎస్సార్‌సీపీ 2019 రికార్డును బద్దలు కొడుతుందని, జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ రోజున యావత్ దేశం ఆంధ్రప్రదేశ్‌ని చూస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ప్రకటించారు.
Date : 04-06-2024 - 11:22 IST -
AP Politics : కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యాన్ని సంపాదించుకున్నారని తొలి నివేదికలు సూచిస్తున్నాయి.
Date : 04-06-2024 - 10:37 IST -
TDP: కోనసీమలో టీటీపీ క్లీన్ స్వీప్.. వైసీపీ మంత్రుల తిరోగమన బాట
Elections Counting: ఏపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగేకొద్దీ టీడీపీ కూటమి అధిక్యం అంతకంతకు పెరిగిపోతుంది. మెజార్టీ మార్కును దాటేసిన కూటమి 128 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. వైసీపీ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక కోనసీమలో టీడీపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. కోనసీమలో అనపర్తి మినహా అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉ
Date : 04-06-2024 - 10:31 IST -
AP Results 2024: ఏపీలో ఎన్డీయే జోరు…మరికాసేపట్లో బాబు పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. వైసీపీ ఓటమి దిశగా పయనిస్తుంది. కాగా ఎన్డీయే కూటమి విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో మరికాసేపట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణపై ఇదరూ పార్టీల నేతలు చర్చించనున్నారు.
Date : 04-06-2024 - 10:11 IST -
AP Results 2024: మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన ఎన్డీఏ కూటమి..ఆధిక్యంలో టీడీపీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.టీడీపీ 81 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. జనసేన 15 స్థానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 5 స్థానాల్లో కొనసాగుతుంది. అయితే అధికార పార్టీ వైసీపీ మాత్రం 14 స్థానాల్లో కొనసాగుతుండటం గమనార్హం.
Date : 04-06-2024 - 9:54 IST -
Sharmila : కడపలో వైఎస్ షర్మిల వెనకంజ
AP Elections Counting: మంగళవారం ఉదయం 8 గంటలకు ఏపిలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల కడపలో వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్న షర్మిల.. రెండో రౌండ్ కు వచ్చేసరికి వెనుకబడ్డారు. షర్మిల ప్రత్యర్థి, వైసీపీ సిట్
Date : 04-06-2024 - 9:35 IST -
AP Results 2024: పులివెందులలో సీఎం జగన్ లీడింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీకి కంచు కోటగా మారిన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి సీఎం జగన్ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది.
Date : 04-06-2024 - 9:33 IST -
AP Results 2024: గుడివాడలో కొడాలి నాని గెలుపు ఖాయమేనా? మరికాసేపట్లో తేలనున్న కొడాలి భవితవ్యం
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మంగళవారం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీనియర్ నేత కొడాలి నాని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ,
Date : 04-06-2024 - 9:17 IST -
AP Results 2024: టీడీపీకి తిరుగులేని ఆ రెండు నియోజకవర్గాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌటింగ్ మొదలైంది. తమదే విజయమని టీడీపీ, వైసీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ రూపంలో ముందంజలో ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ రెండు చోట్ల గెలుపు అనేది సహజంగా కనిపిస్తుంటుంది.
Date : 04-06-2024 - 8:37 IST -
AP Election Results : కౌంటింగ్ ప్రారంభం
ఎన్నికల విధుల్లో ఉన్న 4లక్షల 61వేల 945 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు
Date : 04-06-2024 - 8:16 IST -
AP Results 2024: టీడీపీ ఏజెంటుకు గుండెపోటు
కౌటింగ్ కి ఇంకా కొన్ని నిమిషాలే మిగిలి ఉన్న వేళా టీడీపీ ఎలక్షన్ ఏజెంట్ గుండెపోటుకు గురయ్యాడు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట టీడీపీ ఏజెంట్ రమేష్ గుండెపోటుకు గురయ్యాడు.
Date : 04-06-2024 - 8:09 IST