Gorantla Butchaiah : ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల..
రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్‌గా అధికారిక లాంఛన కార్యక్రమం పూర్తి చేశారు
- By Sudheer Published Date - 08:04 PM, Thu - 20 June 24

రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) రాజ్‌భవన్‌లో ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్‌గా అధికారిక లాంఛన కార్యక్రమం పూర్తి చేశారు. శుక్రవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గోరంట్ల సమక్షంలో 175 మంది ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ముందుగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తరువాత మహిళా సభ్యులు అనంతరం ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. సాధారణ సభ్యులుగానే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. జగన్ సాధారణ సభ్యుల్లాగే బయటి నుంచి నడచుకుంటూ వస్తారని, సభ్యుల సీటింగ్ ఆంగ్ల అక్షరాల ప్రాతిపదికన ఉంటుందని , వైసీపీ సభ్యులందరూ ఒకే చోటే కూర్చుంటారని, ఎక్కడ అనేది సీట్ల కేటాయింపులోనే జరుగుతుందని అన్నారు.
Read Also : Reels : ఉరివేసుకున్నట్లు రీల్ చేద్దాం అనుకున్నాడు..కానీ నిజంగానే ఉరిపడింది