YS Sharmila : వైసీపీ ఆ పని చేయడం వల్లే కడప లో ఓడిపోయా – వైఎస్ షర్మిల
- By Sudheer Published Date - 09:17 PM, Wed - 19 June 24

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)..రీసెంట్ గా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఫై స్పందించారు. ఎన్నికల్లో వైసీపీ విపరీతంగా డబ్బులు పంచడం వల్లే తాను కడపలో గెలవలేదని పేర్కొన్నారు. సీఎం, సిట్టింగ్ ఎంపీ కడప పార్లమెంట్ స్థానంలోని ప్రజలను భయపెట్టారని, వైసీపీ ఓటు వేశామని తెలిస్తే తమను ఇబ్బందులు పెడతారని కడప ప్రజలు భయపడ్డారని షర్మిల తెలిపారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాల్లో కోత పెడతారని, తమకు పథకాలు రాకుండా చేస్తారనే ఉద్దేశంతోనే ఓటర్లు తనకు ఓటు వేయలేదన్నారు. పథకాలు పోతాయనే భయంతోనే వైసీపీ ఓట్లు వేశామని మహిళలు చెబుతున్నారన్నారు. ఒక్కో ఓటుకు వైసీపీ రూ.3,500 పంపిణీ చేసిందని, అనేక రకాలుగా ఓటర్లను ప్రలోభపెట్టారని షర్మిల ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన షర్మిల రాహుల్ గాంధీ కష్టం వల్లే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని.. రాబోయే రోజుల్లో ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు. ప్రజా సమస్యల పట్ల రాహుల్ గాంధీ స్పందన బాగుండటం వల్లే దేశంలో జరిగిన ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఇచ్చారని అన్నారు.’ రాహుల్ గాంధీ ప్రతి కార్యకర్త తల ఎత్తుకునేలా పార్టీ కోసం కృషి చేస్తున్నారు. బీజేపీ మతం పేరుతొ చిచ్చు పెడుతుంది. ఈ పార్టీ అరాచకాలు ఎక్కువయ్యాయి కాబట్టే మెజారిటీ తగ్గిందని షర్మిల చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో ఈసారిఊహించని ఫలితాలు వచ్చాయని , ఓకే నిర్ణయం మీద ఆధారపడి జరిగిన ఎన్నికలన్నారు. జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఆధారంగా జరిగిన ఎన్నికలని షర్మిల విశ్లేషించారు. ఈ సారి ప్రజలు తమ ఓటు కి న్యాయం జరగాలి అనుకున్నారని.. ప్రజలు మార్పు కోరుకున్నారని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా వైసీపీ ఫై కూడా తనదైన శైలి లో షర్మిల చురకలు అంటించింది. పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని తెలిపారు. వైసీపీ నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తామన్నారు.
Read Also : Kharif Season Crops : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం