Jagan : పాపం జగన్..ఎక్కడ కూడా ఆ కోరిక తీరడం లేదు..!!
తన కోరికను ఎప్పటికప్పుడు తీర్చుకోవాలని ఎక్కడికి వెళ్తే అక్కడ విలాసవంతమైన భవనాన్ని తన అభిరుచికి తగ్గట్లు భారీ ఖర్చు పెట్టి నిర్మించుకుంటున్నాడు
- By Sudheer Published Date - 04:02 PM, Thu - 20 June 24

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ మైండ్ లో ఓ కోరిక ఎప్పుడు ఉంటుంది..అదేంటి అంటే ఓ విలాసవంతమైన భవనం కట్టుకొని..అందులో హ్యాపీగా ఉండాలని కోరిక..ఇది ఈరోజుది కాదు తన తండ్రి బ్రతికున్నప్పటి నుండి అలాగే ఉంది. తన కోరికను ఎప్పటికప్పుడు తీర్చుకోవాలని ఎక్కడికి వెళ్తే అక్కడ విలాసవంతమైన భవనాన్ని తన అభిరుచికి తగ్గట్లు భారీ ఖర్చు పెట్టి నిర్మించుకుంటున్నాడు. కానీ అందులో నివాసం ఉండే భాగ్యము కలగడం లేదు. బెంగుళూర్ , హైదరాబాద్ , విశాఖ ఇలా ఎక్కడికి వెళ్లిన అక్కడ విలవంతమైన భవనాలు కట్టుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ముందుగా బెంగుళూర్ లో తన తండ్రి బ్రతుకున్న సమయంలో యలహంక దగ్గర ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ అందులో పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయాడు. వైఎస్ పావురాల గుట్ట వద్ద ప్రమాదానికి గురి కావడంతో ఆయన అందులో ఉండకుండానే రాజకీయం ప్రారంభించాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో బినామీ కంపెనీల పేర్లతో అత్యంత విలాసంగా భవనం నిర్మించుకున్నాడు.. నిర్మించిన ఆ ఇంట్లోనూ ఆయన ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ప్రతిపక్ష నేతగా ఉండటంతో దీక్షలు, పాదయాత్రలతో ఎక్కువ కాలం బయటనే గడిపాడు.
రాష్ట్ర విభజన కావడంతో అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకోవడం తో ఆదిశేషగిరిరావు వెంచర్ లో బినామీ కంపెనీల పేరుతో రెండెకరాలు కొనుగోలు చేసి …అక్కడ ఓ చిన్న ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ తర్వాత అధికారంలోకి రావడం తో ప్యాలెస్ కు అటుఇటుగా తన ఇంటిని మార్చుకున్నాడు. ఆ తర్వాత జగన్ కన్ను రుషికొండ ఫై పడింది. ప్రజా ధనం తో వందల కోట్లు పెట్టి రాజభవనం కు తలదన్నేలా నిర్మించుకున్నాడు. మళ్లీ సీఎం కాగానే ఆ భవనం లో అడుగుపెడదామని కలలు కన్నాడు. కానీ ఎన్నికల్లో ఓడిపోయేసరికి అది కాస్త కూటమి చేతికి వెళ్ళింది. దానిని వారు ఏంచేస్తారనేది చూడాలి. ఇలా జగన్ కోరిక ఎక్కడ తీరలేదు. ప్రస్తుతం జగన్ చెన్నైలోనూ ఓ ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని వినికిడి. మరి ఇది ఎంత వరకు నిజం..ఒకవేళ నిజమైతే అందులో ఎంత వరకు ఉంటాడనేది చూడాలి.
Read Also :