Chandrababu: ఈనెల 25, 26 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన
- Author : Balu J
Date : 21-06-2024 - 12:23 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు దూకుడు పెంచుతున్నారు. ఒకవైపు పాలనవ్యవహారాలను చక్కదిద్దుతూనే… మరోవైపు పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈనెల 25, 26 తేదీల్లో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటించనున్నారు. కుప్పం నుంచి వరుసగా 8 సార్లు గెలుపొందారు. కుప్పం నియోజకవర్గంలోని మండలాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుంది. తనను గెలిపించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన కొనసాగింది. అక్కడ మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. చంద్రబాబు ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో అక్కడకు రావడంతో పెద్దయెత్తున మహిళలు అక్కడకు చేరుకుని చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. తాము ఐదేళ్ల నుంచి మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని మొక్కుకున్నామని చంద్రబాబుకు తెలియజేశారు. టెంకాయ కొట్టి పూజలు నిర్వహించారు.