HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Powerful Full Speech After Visit Amaravati

Amaravati : అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం – సీఎం చంద్రబాబు

అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు

  • Author : Sudheer Date : 20-06-2024 - 3:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Speech Amaravati
Babu Speech Amaravati

అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు. భవనాలు బూజు పట్టిపోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది’ అని చెప్పుకొచ్చారు.

రాజధాని అమరావతి (Amaravati ) ప్రాంతంలో సీఎం చంద్రబాబు (Chandrababu) పర్యటించారు. ఉదయం 11:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది. ముందుగా జగన్‌ కక్షగట్టి కూల్చేయించిన ప్రజావేదికను చంద్రబాబు సందర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఉద్దండరాయునిపాలెంలో అమరావతికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను పరిశీలించి..భవనాల పరిస్థితి తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. 1,631 రోజులు రైతులు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందిన్న ఆయన… A అంటే అమరావతి, P అంటే పోలవరం అని చెప్పుకొచ్చారు. అలాంటి అమరావతి ఏపీ ప్రజలందరి చిరునామా అని , దానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. ‘జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. అమరావతిపై నిత్యం విష ప్రచారం చేశారు. అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లు చూశాం. అందుకే జగన్ లాంటి సీఎం అవసరం లేదని ప్రజలు విసిరికొట్టారు’ అని చంద్రబాబు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అమరావతి ప్రాంతంలో పైపులు, రోడ్డు, మట్టిని దొంగతనం చేస్తున్నా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. దుర్మార్గమైన పాలన నుంచి అమరావతిని దేవుడే కాపాడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ఓట్లేసి మద్దతు పలికిన వారు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ‘దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న జగన్ లాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వారు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? అని విచక్షణతో ఆలోచించాలి’ అని సూచించారు.

అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ‘వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన MLA, MLC క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు. భవనాలు బూజు పట్టిపోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది’ అని అన్నారు. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది…? పనులు ఎప్పటిలోపు అవుతాయనే దానిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత… ఓ అంచనాకు వస్తామని తెలిపారు. అలాగే అమరావతి ప్రజా రాజధాని.. విశాఖ ఆర్ధిక రాజధాని. కర్నూల్‌ను మోడల్ సిటీగా మారుస్తాం. రాయలసీమ సహా రాష్ట్రవ్యాప్తంగా పదకొండు కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించాం” అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

అలాగే గత ప్రభుత్వంలో పని చేసిన విధంగా అధికారులు వ్యవహరించవద్దని చంద్రబాబు కోరారు. ప్రజాహితం కోసం పని చేసే అధికారులకు అండగా ఉంటామని , పని చేసే అధికారులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటుందన్నారు.

Read Also :  Best Phones Under 25K: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న స్మార్ట్ ఫోన్స్?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • chandrababu
  • jagan
  • ycp

Related News

    Latest News

    • Airport : తెలంగాణలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రమంత్రి రామ్మోహన్ గ్రీన్ సిగ్నల్

    • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

    • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

    • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

    • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd