CBN Wishes: సీఎం గారు బర్త్‌డే విషెస్.. భువనేశ్వరి అదిరిపోయే రిప్లై
"ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహకరిస్తూ.. చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు" అని చంద్రబాబు రాసుకొచ్చారు.
- By manojveeranki Published Date - 01:52 PM, Thu - 20 June 24

Cbn Wishes Bhuvaneswari: నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పుట్టిన రోజు (Birth Day) సందర్భంగా సీఎం చంద్రబాబు (Cm Chandrababu) స్పెషల్ విషెస్ చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్లిట్టర్ (Twitter) వేదికగా… భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహకరిస్తూ.. చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు” అని చంద్రబాబు (Chandrababu) రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన భువనేశ్వరి…కృతజ్ఞతలు చెప్పారు. నేను ఎప్పటికీ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను..మీరే నా సర్వస్వం”అంటూ రిప్లై ఇచ్చారు భువనేశ్వరి.
మరోవైపు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కూడా తన మాతృమూర్తికి (Mother) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలం. ప్రజలకు సేవల చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల ఆమె చూపే అంకితభావం స్ఫూర్తిదాయకం. రోజూ అమ్మను ఆరాధిస్తాను. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేసిన ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని… నారా లోకేష్ (Lokesh) పోస్ట్ చేశారు. లోకేష్‌తో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు (Nandamuri Family) సైతం భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు (Wishes) తెలియజేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TeluguDesam Party) అధికారంలోకి రావడానికి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) సైతం ఎంతో కష్టపడి (Hard Work) పని చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. పార్టీకి బలం చేకూర్చారు. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో.. నారా భువనేశ్వరి పుట్టిన రోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ తమ ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో భారీ కేక్‌లను కట్ చేసి (Cake Cutting) ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.