Dr. YSR Health University : డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా బోర్డు మార్చిన వీసీ.. పేరు మార్పుకు గవర్నర్ ఆమోదం
విజయవాడ నడిబోడ్డున ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆందోళన కొనసాగాయి....
- By Prasad Published Date - 08:57 AM, Wed - 2 November 22

విజయవాడ నడిబోడ్డున ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆందోళన కొనసాగాయి. అయితే ఎన్ని ఆందోళనలు చేసిన ప్రభుత్వం పేరు మర్పునకు వెనక్కి తగ్గలేదు. నిన్నటి నుంచి ( నవంబర్ 1) డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా కార్యకలాపాలు సాగుతున్నాయి. అక్టోబర్ 31నఎన్ఠీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీకి సంబంధించిన సైన్ బోర్డును వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ మార్చారు. నూతన యూనివర్సిటీకి సంబంధించి డాక్టర్ వైఎస్ ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం లోగోను వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ విడుదల చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉన్న వీసీ శ్యామ్ ప్రసాద్‌ని ప్రస్తుతం యూనివర్సిటీగా కొనసాగిస్తున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ తొలి వీసీ గా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చివరివీసీ గా కూడా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉన్నారు

Dr. YSR health University