HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Murders In Telugu States Ruling Party Leaders Are The Target

Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో హ‌త్య‌లు.. అధికార పార్టీ నేత‌లే టార్గెట్!

తెలంగాణ‌లోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

  • Author : Gopi Date : 22-10-2024 - 10:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murders In Telugu States
Murders In Telugu States

Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేత‌ల హ‌త్య‌లు (Murders In Telugu States) క‌ల‌క‌లం రేపుతున్నాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడిని హ‌త్య చేయ‌గా.. ఏపీలో తిరుప‌తిలోని టీడీపీ నాయ‌కుడి దారుణ హ‌త్య హాట్ టాపిక్‌గా మారింది. ఈ హ‌త్య‌ల వెన‌క రాజ‌కీయ కార‌ణాలే ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడి హ‌త్య‌

తెలంగాణ‌లోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. గ్రామంలో రాజకీయ కక్షలే హత్య కు ప్రధాన కారణమ‌ని చెబుతున్నారు. త‌మ్ముడి లాంటి వాడిని కోల్పోయానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్య‌క్తం చేశారు. ఈ హ‌త్య‌కు బాధ్యులైన వారిని ప‌ట్టుకోవాల‌ని జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నిర‌స‌న తెలిపారు. అంతేకాకుండా జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా..? కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోలీసులపై మండిప‌డ్డారు. కాంగ్రెస్ పాల‌న‌లో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే గంగారెడ్డిని హత్య చేసినట్టు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read: Adani Group New App: అదానీ గ్రూప్ నుంచి అదానీ వ‌న్ సూప‌ర్ యాప్ విడుద‌ల‌.. త‌క్కువ ధ‌ర‌కే టిక్కెట్లు!

తిరుప‌తిలో టీడీపీ నేత దారుణ హ‌త్య‌

తిరుపతిలో దారుణ హ‌త్య చోటుచేసుకుంది. టీడీపీ నేత మల్లారపు హరిప్రసాద్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఆయ‌న ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోల్‌ పోసి దుండగులు నిప్పంటించారు. ఘటనా స్థలంలోనే హరిప్రసాద్‌ మృతిచెందారు. రాజకీయ కక్షలతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది వైసీపీ నాయ‌కుల ప‌నేన‌ని టీడీపీ ఆరోపిస్తోంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP crime
  • congress
  • crime news
  • Murders
  • Murders In Telugu States
  • tdp
  • telangana
  • telugu states
  • TG Crime

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd