Andhra Pradesh : నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోటీలో టీడీపీ.. టెన్షన్‌లో వైసీపీ
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవరత్తరంగా మారాయి. ఏడు స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో
- By Prasad Published Date - 07:13 AM, Thu - 23 March 23

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవరత్తరంగా మారాయి. ఏడు స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ పోటీ చేయడంతో ఎన్నికలు మరింత హీట్ ఎక్కాయి. ఒక్కోస్థానానికి 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే టీడీపీకి 23 మంది ఉన్నప్పటీకీ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీని దక్కించుకునే అవకాశం లేదు. అయితే వైసీపీలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు సైతం టీడీపీతో టచ్‌లో ఉన్నారనే ఉద్దేశంతోనే టీడీపీ పోటీలో నిలిచిందని విశ్లేషకులు అంటున్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ వైసీపీ ఎమ్మెల్యేలలో ఒక్క ఓటు తప్పు పడ్డ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి టీడీపీ ఈ ఎమ్మెల్సీ సీటుని గెలుస్తుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. మరికాసేపట్లో అసెంబ్లీ సెంట్రల్ హాల్ లో ఈ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి.

Related News

TDP – BJP Alliance : టీడీపీతో కలిస్తే బీజేపీకి లాభమా? ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. మోదీ, షా వ్యూహం అదుర్స్?
తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కీలక నేతలంతా పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలు టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పది ఉమ్మడి జిల్లాల్లో దాదాపు ఐదారు జిల్లాల్లో టీడీపీ ప్రభావం ఉంటుంది.