యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్
కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు లక్షలాది మంది యువతీ యువకులకు స్ఫూర్తిప్రదాత. 100 మీటర్ల హర్డిల్స్‌లో దేశంలోనే అత్యుత్తమ టైమింగ్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఆమె, అనేక అంతర్జాతీయ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు.
- Author : Gopichand
Date : 28-01-2026 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
Yarraji Jyoti: ప్రతిభ ఉంటే చాలు… ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది” అని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదేపదే చెబుతుంటారు. ఆ మాటను ఆయన మరోసారి చేతల్లో నిరూపించారు. అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికలపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఎవరెస్టు శిఖరంపై నిలిపిన పరుగుల రాణి, అర్జున అవార్డు గ్రహీత యర్రాజీ జ్యోతికి రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ గౌరవాన్ని ప్రకటించింది. జ్యోతికి గ్రూప్-1 హోదా ఉద్యోగంతో పాటు, విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలాన్ని కేటాయిస్తూ ఏపీ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ప్రోత్సాహానికి మరో పేరు లోకేష్
నిజానికి యర్రాజీ జ్యోతి ప్రస్థానంలో మంత్రి లోకేష్ పాత్ర మరువలేనిది. జ్యోతి ఎదుగుతున్న ప్రారంభ దశలోనే ఆమెలోని అద్భుతమైన ప్రతిభను లోకేష్ గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ క్రీడాకారుడు వెనకబడకూడదన్నది ఆయన ఆకాంక్ష. అందుకే గతంలో జ్యోతి ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వం తరఫున ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం అందేలా లోకేష్ చొరవ తీసుకున్నారు. శిక్షణ కోసం అవసరమైన అత్యాధునిక వసతులు, కిట్లు సమకూర్చడంలో వ్యక్తిగత శ్రద్ధ కనబరిచారు.
Also Read: కేంద్ర బడ్జెట్ 2026.. యువతకు రూ. 7 వేల వరకు స్టైపెండ్!
కేబినెట్ నిర్ణయం – క్రీడాకారులకు భరోసా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జ్యోతికి సంబంధించిన ప్రతిపాదనలపై కూటమి ప్రభుత్వం ముద్ర వేసింది. విశాఖపట్నం వంటి నగరంలో నివాస స్థలం ఇవ్వడం ద్వారా ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పించడమే కాకుండా గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కల్పించడం ద్వారా ఆమె క్రీడా జీవితం తర్వాత కూడా గౌరవప్రదమైన హోదాలో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.
ఏపీ కీర్తిని చాటిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ
కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు లక్షలాది మంది యువతీ యువకులకు స్ఫూర్తిప్రదాత. 100 మీటర్ల హర్డిల్స్‌లో దేశంలోనే అత్యుత్తమ టైమింగ్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఆమె, అనేక అంతర్జాతీయ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.