Lokesh : నేను ఇతనికి అభిమానిగా మారిపోయాను: మంత్రి లోకేశ్
ఓ పెళ్లిలో మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చం చంద్రబాబు వేషధారణలోనే వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపైకి వచ్చి అందరికీ విక్టరీ సింబల్ చూపించారు.
- By Latha Suma Published Date - 07:17 PM, Sat - 28 December 24

Lokesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇమిటేట్ చేసిన ఒక వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఏపీ మంత్రి నారా లోకేశ్ వరకు చేరింది. దీంతో ఈ వీడియోని లోకేశ్ షేర్ చేసి.. నేను ఇతనికి అభిమానిగా మారిపోయాను. చంద్రబాబు గారిలా మాట్లాడడానికి కనిపించడానికి ఇతను ఎంత కష్టపడ్డాడో చూడండి. అంటూ పేర్కొన్నారు. తాజాగా, ఓ పెళ్లిలో మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చం చంద్రబాబు వేషధారణలోనే వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపైకి వచ్చి అందరికీ విక్టరీ సింబల్ చూపించారు. చంద్రబాబు మాదిరే మాట్లాడుతూ అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
😂😍 I've become a fan of this man. Can see how hard he has worked to look and talk like @ncbn Garu. https://t.co/EcEL3FdFyu
— Lokesh Nara (@naralokesh) December 28, 2024
ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చం చంద్రబాబులానే వేషధారణలో హాజరయ్యారు. సెక్యూరిటీ సిబ్బందితో సహా వేదికపైకి వచ్చి ఆయనలానే మాట్లాడి వధూవరులను ఆశీర్వదించారు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన ఓ అభిమాని షేర్ చేస్తూ.. ‘వామ్మో.. సడెన్‌గా చూసి మా పెద్దాయన అనుకున్నా. సేమ్ బాబుగారిలానే ఉన్నారు.’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా, మంత్రి లోకేశ్ సైతం దీనిపై స్పందిస్తూ అతనికి అభిమాని అయిపోయానంటూ వీడియో షేర్ చేశారు.
ఇకపోతే..సాధారణంగా చాలా మంది ఫెమస్ నాయకులు, సెలబ్రీటీలను ఫాలో అవుతుంటారు. వారు మాట్లాడే విధానం, హవా భావాలను గమనిస్తుంటారు. వారిలా డ్రెస్సింగ్, లుక్కింగ్ ఉండేలా ప్లాన్ లు చేసుకుంటారు. అచ్చం వారి గొంతు వచ్చేవిధంగా మిమిక్రీ కూడా చేస్తుంటారు. అయితే.. కొన్నిసందర్బాలో వీరు అచ్చం.. నిజమైన వారిలో కూడా కన్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి అచ్చం… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిరిగా డ్రెస్సింగ్ వేసుకుని.. ఆయనకు మల్లే ప్రజల్ని పలకరిస్తు హల్ చల్ చేశారు.